కార్పెట్ ఫ్యాక్టరీలో విషవాయువులు లీక్ : ఏడుగురు కార్మికులు మృతి

ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో పైపులైన్‌లో విషవాయువు లీకైన ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. గురువారం (ఫిబ్రవరి 6,2020) ఉదయం 8 గంటలకు జరిగింది. సీతాపూర్ పట్టణంలోని బిస్వాన్ కొత్వాలి ప్రాంతంలోని జలాల్పూర్ లోని కార్పెట్ ఫ్యాక్టరీ, యాసిడ్ రెండు ఫ్యాక్టరీల్లోని నుంచి విషయవాయువులు లీక్ అయ్యాయి. పరిశ్రమలకు మధ్య ఉన్న గ్యాస్ పైపులైన్ నుంచి విషవాయువు లీక్ అయింది.
ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా సమాచారం. మరో ఇద్దరు వేరు వేరు ప్రాంతానికి చెందినవారనీ సీతాపూర్ జిల్లా మెజిస్ట్రేట్ అఖిలేష్ తివారీ చెప్పారు. గ్యాస్ లీక్ ప్రమాదం సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. పోలీసు ఉన్నతాధికారులతో పాటు పరిపాలనా అధికారులు, హెవీ ఫోర్స్ ఘటనాస్థలానికి తరలివచ్చింది. పోలీసులు సహాయక చర్యల్ని చేపట్టారు. తివాచీలకు రంగులు వేయటానికి ఉపయోగించే రసాయనాన్ని కార్పెట్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ లీక్ అయ్యిందని దర్యాప్తు అనంతరం పోలీసులు తెలిపారు.
సీతాపూర్ సంఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తంచేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనతో బాధపడుతున్న ప్రజలకు సాధ్యమైనంత ఉపశమనం కల్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. గ్యాస్ లీక్‌తో మరణించిన ప్రతి వ్యక్తికి రూ .4-4 లక్షల నష్టపరిహాన్ని ప్రకటించారు.