ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను హరియాణాతో అనుసంధానం చేసే ఈస్ట్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా.. మృతులలో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు చెబుతున్నారు. మరో 8 మంది తీవ్రంగా గాయడినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం గ్రేటర్ నోయిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైట్-5లో జరగగా.. హరియాణాలోని బల్లాభగడ్‌లో జరిగిన పెళ్లికి హాజరైన 13 మంది కారులో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతులంతా బులంద్‌షహర్ పరిధిలోని మీఠాపూర్ గులావఠీకి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వీరిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం సహాయ చర్యలు చేపట్టారు పోలీసులు.