ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

  • Published By: bheemraj ,Published On : November 11, 2020 / 08:01 PM IST
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Updated On : November 11, 2020 / 8:22 PM IST

Six members killed : ఒడిశాలో విషాధం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. బాలంగీర్ జిల్లా సంరపాడ గ్రామంలో బుధవారం (నవంబర్ 11, 2020) ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారినా కూడా ఆ ఇంటి తలుపులు తెరుచుకోకపోవడాన్ని ఇంటి పొరుగున ఉన్నవారు గమనించారు. కిటికీ నుంచి లోపలకు చూడగా ఇంట్లోని వారంతా అచేతనంగా పడి ఉన్నారు. వారిపై దుప్పట్లు కప్పి ఉన్నాయి.



దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపలకు వెళ్లి చూడగా కుటుంబంలోని ఆరుగురు సభ్యులు మృతి చెంది ఉండటాన్ని గమనించారు. మృతులను బులు జాని (50), అతని భార్య జ్యోతి (48), ఇద్దరు కుమార్తెలు సరిత, శ్రేయ, ఇద్దరు కుమారులు భీష్మ, సంజీవ్‌గా గుర్తించారు.



వారి శరీరాలపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గమనించారు. దీంతో ఆ కుటుంబంలోని వారిని హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.