Allahabad University VC : నిద్ర పట్టడం లేదు..లౌడ్ స్పీకర్లు నిషేధించండి, మెజిస్ట్రేట్ కు లేఖ రాసిన యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్
లౌడ్ స్పీకర్ల కారణంగా..తన నిద్రకు భంగం కలిగిస్తున్నారని..వెంటనే వాటిని నిషేధించాలంటూ...జిల్లా మెజిస్ట్రేట్ కు అలహాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సంగత శ్రీ వాస్తవ లేఖ రాయడం కలకలం రేపుతోంది.

Allahabad University VC
Allahabad University VC : లౌడ్ స్పీకర్ల కారణంగా..తన నిద్రకు భంగం కలిగిస్తున్నారని..వెంటనే వాటిని నిషేధించాలంటూ…జిల్లా మెజిస్ట్రేట్ కు అలహాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ సంగత శ్రీ వాస్తవ లేఖ రాయడం కలకలం రేపుతోంది. తనింటి దగ్గరున్న ఓ వర్గానికి చెందిన దగ్గర…ఉదయాన్నే లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని, దీనివల్ల ఉదయాన్నే తనకు నిద్ర పట్టడం లేదని…డీఎం భాను చంద్ర గోస్వామికి రాసిన లేఖలో వెల్లడించారు. దీనిపై డీఎం స్పందించారు.
నిబంధనల ప్రకారం..తగిన చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. లౌడ్ స్పీకర్లు బంద్ చేసిన అనంతరం తనకు మరలా నిద్ర పట్టడం లేదని, దీనివల్ల తనకు తలనొప్పి వస్తోందన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చారు. ప్రధానంగా..ఆ వర్గానికి చెందిన ప్రముఖ రోజుల్లో మరీ విపరీతంగా లౌడ్ స్పీకర్లు వాడుతున్నారని లేఖలో వెల్లడించారు. కొందరు ఈ లేఖను సమర్థిస్తుండగా..మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
2017లో ప్రముఖ గాయకుడు సోను నిగమ్ కూడా ఈ విషయంలో ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బలవంతపు మతతత్వం భారతదేశంలో ఎప్పుడు ముగుస్తుందని ట్వీట్ చేశారాయన. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ పై ఫత్వా జారీ అయిన సంగతి తెలిసిందే. ఆయనకు గుండు కొడితే 10 లక్షల రూపాయలు ఇస్తానని కోల్ కతాకు చెందిన ముస్లిం మత గురువు ప్రకటించారు. సోనూ నిగమ్ కు వ్యతిరేకంగా ఈ నెల 21న ర్యాలీ చేపట్టనున్నట్టు ఆయన అప్పట్లో ప్రకటించారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న సోనూ తన ఇంటికి పిలిచి ‘గుండు కొట్టించుకుంటా.. రూ. 10 లక్షలు సిద్ధం చేసుకో’మని మతపెద్దకు సవాల్ విసిరారు. అన్నట్టుగానే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను తన ఇంటికి పిలుపించుకుని గుండు కొట్టించుకున్నారు సోనూ.