కమల్‌ హాసన్‌పై చెప్పులు విసిరారు

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 06:06 AM IST
కమల్‌ హాసన్‌పై చెప్పులు విసిరారు

Updated On : May 16, 2019 / 6:06 AM IST

ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు విసిరారు. ఈ ఘటన మధురై అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. తిరుప్పన్ రాన్ కుంద్రమ్‌లో కమల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్నారు. వాహనంపై నిలబడి ప్రసంగిస్తుండగా..ఒక్కసారిగా జనాల మధ్యలో నుండి కమల్ వైపు చెప్పులు విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే ఆ చెప్పులు ఆయనకు తగలలేదు. వాహనానికి తగిలి కిందపడిపోయాయి. ఈ ఘటనతో కలకలం రేగింది. దీనికి సంబంధించి 11 మందిపై పోలీసులకు ఆ పార్టీ నేతలు కంప్లయింట్ చేశారు. ఇందులో బీజేపీ నేతలు, హనుమాన్ సేనకు చెందిన లీడర్స్ ఉన్నారు. 

ఇటీవలే కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువైన నాథూరామ్ గాడ్సే తొలి ఉగ్రవాది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. కమల్‌పై కేసు కూడా ఫైల్ అయ్యింది. దీంతో ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టులో ఆయన అప్లై చేశారు. మే 16వ తేదీ గురువారం కమల్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.