అప్పుడలా ఇప్పుడిలా : స్మృతి ఇరానీ డిగ్రీ పూర్తవ్వలేదంట

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 09:28 AM IST
అప్పుడలా ఇప్పుడిలా : స్మృతి ఇరానీ డిగ్రీ పూర్తవ్వలేదంట

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు.

అమేథీ :  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలు మరోసారి తెరపైకి వచ్చాయి. లోక్ సభలో అమేథీ నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై పోటీకి దిగారు. దీనికి సంబంధించి ఆమె ఏప్రిల్ 11న అయేథీలో నామినేషన్  వేశారు. ఈ నామినేషన్ లో తన విద్యార్హతను డ్రిగ్రీ పూర్తిచేసినట్లుగా చూపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. 2004 నామినేషన్ పత్రాలలో డిగ్రీ పూర్తయినట్లుగా స్మృతి వెల్లడించారు. కానీ 2019 లోక్ సభ ఎన్నికల పోటీ సందర్భంగా అయేథీలో వేసిన అఫిడవిట్ లో మాత్రం డిగ్రీ డిస్కంటిన్యూ అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడు మరోసారి ఆమె విద్యార్హతలపై వివాదం చెలరేగింది. 
Read Also : రూ.8 కోట్లకు లెక్కలు పక్కా : BJP కి ఐటీ క్లియరెన్స్

2014లో బీకాం కోసం ఢిల్లీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నాని..ఇప్పుడేమో బీకాం పూర్తి చేయలేదని పేర్కొన్నారు స్మృతి ఇరానీ. తాజాగా నిన్న దాఖలు చేసిన ఎన్నికల ఆఫిడవిట్‌లో ఆమె తన విద్యార్హతలను పేర్కొన్నారు. 1991లో ఆల్ ఇండియన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్(పదో తరగతి), 1993లో ఆల్ ఇండియన్ సీనియర్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(ఇంటర్) పాస్ అయినట్లుగా  ఆమె వెల్లడించారు. 

ఇప్పటికి ఆమె డిగ్రీ విషయంలో మూడు సార్లు మూడు రకాలుగా తెలిపారు. నిన్న దాఖలు చేసిన ఆఫిడవిట్‌లో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో దూర విద్యలో బ్యాచిలర్ కామర్స్ పార్ట్ 1 మాత్రమే చదివానని, డిగ్రీ మొత్తం పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అయితే 2004 ఎన్నికలప్పుడు స్మృతి ఇరానీ 1996లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందినట్టు పేర్కొన్నారు. 

2014 ఎన్నికల ఆఫిడవిట్‌లో బీకామ్ కోసం 1994లో ఢిల్లీ యూనివర్సిటీ దూర విద్యలో అడ్మిషన్ తీసుకున్నట్లు తెలిపారు. అంతే కాదు.. 2014 ఆగస్టులో జరిగిన ఓ మీడియా సమావేశంలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. యూఎస్‌లోని ప్రతిష్టాత్మక యేల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందినట్లు చెప్పారు. కాగా గతంలో కూడా స్మృతి విద్యార్హతలపై విపక్షాలు ఘాటుగా స్పందించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆమె విద్యార్హతలను తెలియజేయాలని డిమాండ్ చేస్తోంది. 
Read Also : కాంగ్రెస్‌కు హఠావో మోడీ పిలుపు