చాట్ దుకాణంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

చాట్ దుకాణంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

Updated On : March 1, 2021 / 2:39 PM IST

Smriti Irani : రాజకీయాల్లో ఉన్న వాళ్లలో ఉన్న కొంతమంది సామాన్యుడిలా మారిపోతుంటారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా..హంగు, ఆర్బాటం పక్కన పెట్టేసి..ప్రజల్లో కలిసిపోతుంటారు. ఇటీవలే రాహుల్ గాంధీ సరదా సరదాగా ప్రవర్తిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రంలో దూకి ఈత కొట్టడం, మత్స్యకారులతో చేపలు పట్టడం చేశారు. తాజాగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చాట్ దుకాణంలోకి వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కడ ఆమె..చాట్ తిన్నారు.

వారణాసిలో బీజేపీ సంస్థాగత సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొనడానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వచ్చారు. కచహరి మీదుగా వెళుతుండగా..చాట్ దుకాణం చూశారు. వెంటనే కారు దిగి..అందులోకి వెళ్లి బనారసీ చాట్ తిన్నారు. పానీ పూరీన ఇష్టంగా తిన్నారు. ఎలా ఉందని షాప్ ఓనర్ అడిగిన ప్రశ్నకు హరహర మహాదేవ్ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

‘ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి’ అని చెప్పారు. స్థానికులు చూసి స్మృతి ఇరానీతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.ఇక వారణాసిలో జరిగిన ఈ మీటింగ్ కు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by India Today (@indiatoday)