స్మృతి ఇరానీ టిక్ టాక్ వీడియో: భారత స్త్రీలు భర్త వెనుక ఎందుకు నడుస్తారంటే..

స్మృతి ఇరానీ పాత వీడియోతో ఓ యువతి చేసిన టిక్ టాక్ వీడియో వైరల్‌గా మారింది. 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ఓ ఈవెంట్‌లో మాట్లాడిన వీడియోలో కొద్ది సెకన్ల వీడియో.. అప్పట్లోనూ హడావుడి చేసింది. భారత మహిళలు భర్తలకు రెండు అడుగుల వెనుక ఎందుకు నడుస్తారనే విషయంపై ఆమె ఇలా చెప్పుకొచ్చారు.
చూడటానికి స్మృతి ఇరానీకి దగ్గర పోలికలు ఉన్న పాహి అనే టిక్ టాక్ యూజర్.. ఓ వీడియో పోస్టు చేసింది. అందులో నాలాంటి భారత మహిళలు భర్తకు రెండు అడుగుల వెనుకాలే ఎందుకు నడుస్తారో తెలుసా.. ఇదేమీ పెద్ద సమస్య కాదు. దేవుడు నిర్దేశించిన దాని ప్రకారం.. నాకు కొన్ని విలువలు ఉన్నాయి. ఓ భారత మహిళగా ఆయన వెనుకే ఉంటాను. ఏదైనా అభిప్రాయంలో తప్పు అయితే అది సరిదిద్దగలను. అందుకనే నేను ఆయన వెనుకే ఉంటాను’ అని చెప్పారు.
మహిళలకు, యువతులకు సపోర్టివ్ గా ఉండటంతో ఆ వీడియోను తెగ ఇష్టపడుతున్నారు. అంతేకాదు, లైక్‌లు, షేర్‌లు చేస్తుండటంతో వైరల్ అయింది. దీనిని ఇప్పటికే లక్షా 51వేల లైక్‌లు వచ్చాయంటే ఆశ్చర్యమే. ఎందుకంటే వీడియో మొత్తంలో ఆ యువతి చేసిందేమీ లేదు. కేవలం ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే అందులో ఉన్న డైలాగ్స్‌కే అంత క్రేజ్ అన్నమాట.
Best reply to why Indian women walk behind her husband!!!???????? pic.twitter.com/rFEZClQKt1
— logical thinker (@murthykp) January 2, 2020