Cow Smuggling: ఆవును తరలిస్తూ హై స్పీడ్ వెహికల్‌లో నుంచి తోసేసిన దుండగులు
హర్యానాలోని సోనా గ్రామంలో ఆవును తరలిస్తుండగా పోలీసులు చేజింగ్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల భయంతో అంత వేగంలో ప్రయాణిస్తున్నప్పటికీ వాహనంలో ఉన్న ఆవును మధ్యలోనే తోసేశారు.

Cow Smuggling
Cow Smuggling: హర్యానాలోని సోనా గ్రామంలో ఆవును తరలిస్తుండగా పోలీసులు చేజింగ్ చేయడం మొదలుపెట్టారు. పోలీసుల భయంతో అంత వేగంలో ప్రయాణిస్తున్నప్పటికీ వాహనంలో ఉన్న ఆవును మధ్యలోనే తోసేశారు. 22కిలోమీటర్ల దూర ప్రయాణంలో మితిమీరిన వేగంతో స్మగ్లర్లు మూగజీవాలను తరలించే ప్రయత్నం చేశారని పోలీసులు వెల్లడించారు.
ఆవు స్మగ్లర్లను ఎట్టకేలకు అదుపులోకి తీసుకుని దేశీవాలీ తుపాకీలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గురుగావ్ సైబర్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నిందితులను యహ్యా, బల్లూ, తస్లీమ్, ఖలీద్, సహీద్ లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశువుల స్మగ్లర్లు ట్రక్ లో ఏడు ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం అందింది. పోలీసుల చేజింగ్ లో ట్రక్ టైర్లు దెబ్బతినడంతో మూగజీవాలను వాహనంలో నుంచి తోసేయడం మొదలుపెట్టారు. ఈ విషయం గమనించి మరింత వేగంతో మూడు ఎస్యూవీ వాహనాలతో వెంబడించి దుండుగలను పట్టుకున్నారు.
Read Also : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి
సెక్షన్ 13(2) ప్రకారం.. హర్యానా గౌవాంశ్ సంస్కరణ్, గోసంవర్ధన్ యాక్ట్ 2015, సెక్షన్ 307 ప్రకారం బోండ్సీ పోలీస్ స్టేషన్ లో శనివారం కేసు నమోదు చేశారు.