Anand Mahindra : వాటే ఐడియా..సింపుల్ గా ఉన్నా..ఏం క్రియేటివిటీ..!!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో షేర్ చేసుకునే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూడటానికి సింపుల్ గా ఉన్నా క్రియేటివిటీ కనిపిస్తోంది..

Anand Mahindra : వాటే ఐడియా..సింపుల్ గా ఉన్నా..ఏం క్రియేటివిటీ..!!

Anand Mahindra Shares Another Creative Video As Internet Says Brilliant

Updated On : July 19, 2022 / 1:22 PM IST

Anand Mahindra : సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన అంశాలను తన ఫాలోవర్లతో షేర్ చేసుకునే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూడటానికి సింపుల్ గా ఉన్నా క్రియేటివిటీ కనిపిస్తోంది..ఒక ఇంటి గోడపై డెకరేషన్‌గా ఐరన్ రాడ్లతో డిజైన్ కనిపించింది. కానీ అది అంతలోనే పై అంతస్థుకు చేరుకునే మెట్లలా మారిపోయింది. ఈ క్రియేటివిటీకి ఆనంద్ మహేంద్ర ఫిదా అయిపోయారు.

ఒక ఇంటి గోడకు అప్పటి వరకు ఓ డిజైన్ లాగా ఉన్న ఓ డెకరేషన్ ని ఒక వ్యక్తి వచ్చి.. ఆ డిజైన్‌కు వేసి ఉన్న ఒక చిన్న లాక్ తొలగించి దాన్ని మెట్లుగా మార్చేశాడు. ఆ మెట్లపై ఎక్కి మొదటి అంతస్తు చేరుకొని తిరిగొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ లాక్ చేసేసి చూపించాడు. ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా..‘‘అద్భుతం. చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా ఎంతో క్రియేటివ్‌గా ఉంది. ఉన్న కొద్దిపాటి స్థలాన్ని సేవ్ చెయ్యడమే కాదు.. బోసిగా ఉండే గోడపై మంచి డిజైన్‌లా కూడా ఉంది. ఇది చూసిన తర్వాత స్కాండనేవియన్ డిజైనర్లు కూడా అబ్బురపడాల్సిందే. (ఇది ఎక్కడిదో తెలియదు. నా వాట్సాప్ వండర్ బాక్స్‌లో ఎవరో పంపారు)’’ అని ట్వీట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు కూడా ఆ క్రియేటివిటీకి ఫిదా అయిపోతున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.