క్యాబినెట్ మీటింగ్‌లోనూ ప్రధాని స్ట్రిక్ట్ సోషల్ డిస్టెన్స్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (మార్చి 24, 2020) న 21 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 21 రోజుల లాక్ డౌన్ లో భాగంగా మెుదటి రోజున ఢీల్లీలోని ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో భవనంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి, ప్రతి ఒక్క మంత్రికి మధ్య ఉన్న సామాజిక దూరం పాటిస్తున్నా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రాణాంతకమైన వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ మూడు వారాలపాటు ప్రజలు ఎవరు తమ ఇండ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలన్ని మంగళవారం (మార్చి 24, 2020) సాయత్రం మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రక్రటించారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 14వేల మంది ఈ వైరస్ భారీన పడి మరణించారు. అందుకే 21 రోజుల లాక్ డౌన్ సమయం ముఖ్యమైంది అని అన్నారు. ఈ వైరస్ నియత్రించటానికి సామాజిక దూరం అతి పెద్ద మార్గమని ఆయన తెలిపారు.
కొంతమంది మాత్రం సామాజిక దూరాన్ని లెక్క చేయకుండా బయటకు వస్తున్నారు. సామాజిక దూరం అంటే రోగులకు మాత్రమే అని చాలా మంది అనుకుంటున్నారు. అది తప్పు, సామాజిక దూరం అనేది అందరీకి వర్తిస్తుంది. ప్రధానమంత్రికి కూడా వర్తిస్తుందని అరగంట సమావేశంలో మోడీ వివరించారు. అయితే భారత దేశంలో ఇప్పటి వరకు 530 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి 9 మంది ప్రాణాలు కోల్పోయారు.