Cow Hug Day: సోషల్ మీడియా దాడికి వెనక్కి తగ్గిన కేంద్రం.. ‘కౌ హగ్ డే’ను రద్దు చేస్తూ ఉత్తర్వులు
ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine's Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన వచ్చింది. ఈ వాలెంటైన్స్ డే రోజున ఆవులను కౌగిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జంతు సంరక్షణ బోర్డు (Animal Welfare Board of India) ప్రకటించింది

Social media effect, Union govt took uturn on 'Cow Hug Day'
Cow Hug Day: ఏడాదిలో అనేకమైన ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. అందులో ప్రపంచ వ్యాప్తి పొందినవి చాలానే ఉన్నాయి. కొన్ని దేశాల్లో ప్రత్యేక క్యాలెండర్లు, ప్రత్యేక సంప్రదాయాలు, ప్రత్యేక సంస్కృతులు ఉన్నప్పటికీ విశ్వవ్యాప్తమైన కొన్ని ప్రత్యేక రోజులను ప్రపంచమంతా జరుపుకుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇలాంటి కొన్ని పండగలపై కొన్ని దేశాల నుంచి అప్పుడప్పుడు వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా మన దేశంలో జనవరి 1, ఫిబ్రవరి 14 తేదీలు ఏనాటి నుంచో వివాదాస్పదమవుతూ ఉన్నాయి.
Adani Group: హిండెన్‌బర్గ్‌తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ
జనవరి 1న మనకు నూతన సంవత్సరం కాదని, ఉగాది లాంటి పంచాంగాలు ప్రారంభమయ్యే భారతీయ పండగల నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని వారి వాదన. ఇక ఫిబ్రవరి 14 మీద అయితే ఏకంగా నిషేధమే విధించాలనే డిమాండ్లు వినిపిస్తుంటాయి. ప్రేమించడమే పాపం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు కొందరు. సంస్కృతీ-సంప్రదాయాల పేరుతో ఆరోజున అక్కడక్కడ కొన్ని తీవ్ర పరిమాణాలు కూడా చోటు చేసుకుంటుంటాయి. కొన్ని సంస్థలు ఫిబ్రవరి 14న పసుపు తాడు పట్టుకుని పార్కుల చుట్టూ పహారా కాస్తాయి. ఏ ఇద్దరు కనిపించినా అక్కడికక్కడే పెళ్లి జరిపించేస్తున్నాయి. దీంతో బెంబేలెత్తుతున్న కొందరు ప్రేమికులు ఆ రోజున ఎవరి కంటా పడకుండా ప్రేమను పంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి వాదనలకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఊతం ఇస్తున్నట్లుగా కొన్నిసార్లు కనిపిస్తుంటుంది. ప్రభుత్వంలో ఉండే పెద్దల మాటలు, అప్పుడప్పుడు ప్రభుత్వ తీరు ఈ సంకేతాలను ఇస్తుంటుంది.
ఇక అసలు విషయంలోకి వస్తే.. ఈ ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ (Valentine’s Day) జరుపుకోవడానికి దేశంలోని ప్రేమపక్షులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని చూస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ‘వాలెంటైన్ వీక్’లోని ఒక్కో రోజును ఆస్వాదిస్తున్నారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన వచ్చింది. ఈ వాలెంటైన్స్ డే రోజున ఆవులను కౌగిలించుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జంతు సంరక్షణ బోర్డు (Animal Welfare Board of India) ప్రకటించింది. ‘కౌ హగ్ డే’గా ఈ నిర్ణయం బాగా పాపులర్ అయింది కూడా.
Supreme Court: ఎట్టకేలకు సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో న్యాయమూర్తుల నియామకం
ఈ ప్రకటన చూసి నెటిజన్లకు, అందునా ప్రేమికులకు చిర్రెత్తుకొచ్చింది. ప్రేమను పంచుకోవాల్సిన రోజును ఆవును కౌగిలించుకోవడం ఏంటంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ వాలరం చూస్తుంటే ‘వాలెంటైన్స్ డే’ సహా మరికొన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వ ఆడుతున్న నాటకంలా ఉందంటూ సోషల్ మీడియాను మీమ్స్, కామెంట్లు హోరెత్తించారు. కామెడీ కార్డూన్లు, ఎడిటింగ్ వీడియోలు అయితే చెప్పక్కర్లేదు. ఏ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రకటన చేసిందో కానీ, ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించి ఉండదు. సోషల్ మీడియా దద్దరిల్లడంతో ఇక లాభం లేదనుకున్న ప్రభుత్వం.. ‘కౌ హగ్ డే’ను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.