Solar Eclipse 2022 : భారత్‌లో గ్రహణం మొదలు.. కనువిందు చేస్తున్న సూర్యగ్రహణం, నేరుగా చూడొద్దని హెచ్చరిక
దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణం మొదలైంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.49 గంటలకు, విజయవాడలో సాయంత్రం 4.49 గంటలకు, విశాఖలో సాయంత్రం 5.01 గంటలకు, తిరుపతిలో సాయంత్రం 5.01 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమైంది.

Solar Eclipse 2022 : దేశంలోని పలు ప్రాంతాల్లో సూర్యగ్రహణం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రహణం మొదలైంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు, విజయవాడలో సాయంత్రం 4.49 గంటలకు, విశాఖలో సాయంత్రం 5.01 గంటలకు, తిరుపతిలో సాయంత్రం 5.01 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమైంది.
మన దేశంలో సాయంత్రం 6గంటల 26 నిమిషాలవరకు సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాంతాలను బట్టి స్వల్ప మార్పులు ఉంటాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రహణం 49 నిమిషాల పాటు కనిపించనుంది. గ్రహణాన్ని వీక్షించేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా, గ్రహణాన్ని నేరుగా చూడొద్దని నిపుణులు సూచించారు.
ఈశాన్య ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా సూర్యగ్రహణం కొనసాగుతోంది. అయితే సూర్యగ్రహణం వేళ సూర్యుడిని నేరుగా చూడొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేరుగా చూడటం చాలా డేంజర్ అంటున్నారు. సూర్యుడిని నేరుగా చూస్తే రెటీనా దెబ్బతిని, కంటికి ప్రమాదం కలుగుతుందని తెలిపారు. బ్లాక్ ఫిల్మ్, బ్లాక్ పాలిమార్, సోలార్ ఫిల్టర్, గాగుల్స్, వెల్డింగ్ గ్లాస్ ద్వారా సూర్యుడిని చూడొచ్చని చెప్పారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
సాధారణంగా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు భూమి మీద కొంతభాగంలో సూర్యుడు సంపూర్ణంగా కనిపించకుండా పోతాడు. మరికొంత భాగంలో పాక్షికంగా కనిపించకుండా పోతాడు. దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ, తెలంగాణలో 49 నిమిషాల పాటు సూర్యగ్రహణం కనిపించనుంది. పిల్లలు, పెద్దలు గ్రహణాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యూరప్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఆఫ్రికాలో సూర్యగ్రహణం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం కనిపిస్తోంది.
ఈ గ్రహణాన్ని అరుదైన ఖగోళ విచిత్రంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే చాలా ఏళ్ల వరకు ఇలాంటి గ్రహణం మళ్లీ భారత్ లో కనిపించదు. మన దేశంలో తదుపరి సూర్యగ్రహణం 2027 ఆగస్టు 2న కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. మన దేశంలో జైపూర్, నాగ్ పూర్, ద్వారక, చెన్నై, ముంబై, కోల్ కతా నగరాల్లో గ్రహణం కనిపిస్తోంది. అయితే, ఈ ప్రాంతాల్లో కూడా మసకబారిన 43 శాతం సూర్యుడిని మాత్రమే చూడగలము.
సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటల నుంచి 6.26 గంటల వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ లో సాయంత్రం 4.59 గంటలకు, ఢిల్లీలో సాయంత్రం 4.29, కోల్ కతాలో 4.52, చెన్నైలో 5.14, ముంబైలో 4.49, ద్వారకలో 4.36, తిరువనంతపురంలో 5.29, నాగ్ పూర్ లో 4.49 గంటలకు గ్రహణం ప్రారంభమైంది. గ్రహణాన్ని నేరుగా కంటితో చూడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరించారు.