ITC Delhi Watchman : వావ్.. ఏం స్టోరీలే.. నాన్న వాచ్‌మెన్‌గా పనిచేసిన ఫైవ్ స్టార్ హోటల్‌కి గెస్ట్‌గా తీసుకెళ్లిన కొడుకు..!
ITC Delhi Watchman : కొడుకు తన తండ్రిని ఢిల్లీలోని 5-స్టార్ హోటల్ డిన్నర్‌కి తీసుకెళ్లాడు. 25 ఏళ్ల క్రితం వాచ్‌మెన్‌గా అక్కడే పనిచేసేవాడు. నెటిజన్లను కదిలించిన స్టోరీ..

Former ITC Delhi watchman
ITC Delhi Watchman : వ్యక్తి ఎంత పెద్దవాడైనా తల్లిదండ్రుల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేడు అంటారు. తల్లిదండ్రులు మన కోసం చాలా చేస్తారు. దానికి విలువ కట్టలేం. తమ కాళ్లపై తాము నిలబడగలిగే శక్తి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అందాల్సిన ఆనందాన్ని అందించడం పిల్లల బాధ్యత.
సాధారణంగా, కూతుళ్లతో తండ్రులకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇది సహజమే. ప్రపంచంలో ఎప్పటినుంచో కనిపించేది.. వినిపించేదే.. కూతుళ్లే తండ్రి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని అంటారు. కానీ, కొడుకు కూడా తండ్రి ప్రేమలో తక్కువవేమి కాదని నిరూపించాడు. తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ, కృతజ్ఞతతో కూడిన మదురమైన క్షణం సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించింది.
న్యూఢిల్లీలోని ఐటీసీలో 1995 నుంచి 2000 వరకు వాచ్‌మెన్‌గా పనిచేసిన తన తండ్రిని ఇటీవల ఓ వ్యక్తి 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ప్రదేశానికి ప్రత్యేక విందు కోసం తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆ పోస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
ఇందులో కొడుకు తన తండ్రిని ఢిల్లీలోని అదే 5-స్టార్ హోటల్‌కి తీసుకెళ్లాడు. 25 ఏళ్ల క్రితం వాచ్‌మెన్‌గా అక్కడే పనిచేసేవాడు. ఇప్పుడు అతడి కల నిజమైంది అనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ బిడ్డను సమర్థులుగా మార్చడానికి తమ జీవితాంతం కష్టపడుతుంటారు. దానికి ప్రతిగా, ఆ కొడుకు కూడా వారిని విజయ మార్గంలో చూస్తుంటే.. తల్లిదండ్రులకు ఇంతకంటే సంతోషకరమైనది మరొకటి ఉండదు.
5 స్టార్ హోటల్‌లో డిన్నర్ :
న్యూఢిల్లీలోని ఐటీసీ హోటల్‌లో తన తల్లిదండ్రులతో టేబుల్‌పై కలిసి భోజనం చేస్తున్న ఫొటోను పోస్ట్ చేస్తూ తన భావాలను వ్యక్తపరిచాడు. 1995 నుంచి 2000 వరకు తన తండ్రి ఈ హోటల్ బయట వాచ్‌మ్యాన్‌గా ఉండేవాడని ఆర్యన్ చెప్పాడు. సరిగ్గా 25 సంవత్సరాల తరువాత అదే హోటల్‌కి తన తండ్రితో డిన్నర్‌కు తీసుకువెళ్లే అవకాశం వచ్చిందన్నాడు.
My father was a watchman at ITC in New Delhi from 1995-2000; today I had the opportunity to take him to the same place for dinner 🙂 pic.twitter.com/nsTYzdfLBr
— Aryan Mishra | आर्यन मिश्रा (@desiastronomer) January 23, 2025
ఆర్యన్ మిశ్రా ఎక్స్‌లో ఉద్వేగభరితమైన క్షణాన్ని పంచుకుంటూ ఆ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. ఇంటర్నెట్ యూజర్లు సైతం ఈ పోస్ట్ చదివి చాలా ఉద్వేగానికి లోనయ్యారు. కామెంట్ సెక్షన్‌లో ఎమోషనల్ అవుతున్నారు. కాగా, ఈ పోస్ట్‌ను 48 వేల మంది వినియోగదారులు లైక్ చేశారు. అదే కామెంట్ సెక్షన్‌లో 1,900 కన్నా ఎక్కువ రియాక్షన్లు వచ్చాయి.
ఈ కథ నెటిజన్లను మరింతగా ఆకర్షించింది. ఒక నెటిజన్ “మన #తల్లిదండ్రులను ప్రేమిద్దాం. పిల్లల ఎదుగుదల, భవిష్యత్తు కోసం వారు అన్ని త్యాగాలు చేస్తారు. పిల్లలు, వారు పెరిగినప్పుడు, వారి తల్లిదండ్రులకు ప్రేమ, శ్రద్ధతో మెలగాలి. నేను దేవుడిని చూడలేదు, కానీ నేను నా తల్లిదండ్రులను చూశాను! ” అంటూ కామెంట్లలో తెలియజేస్తున్నారు.
ఈ ఫోటో చూసి చాలా హ్యాపీగా ఉంది అని ఒకరు అన్నారు. ఏ కొడుకైనా ఇది చాలా గర్వకారణం అని ఒకరు అన్నారు. ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్పవారు లేరని ఒకరు అన్నారు. వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని ఒకరు, నిజమైన విజయం అంటే ఇదేనని మరొకరు అన్నారు.