Solar Heated Tent: రియల్ లైఫ్ పున్ షుక్ వాంగ్డూ.. ఆర్మీ కోసం సోనమ్ వాంగ్ చుక్ ప్ర్రత్యేక ఆవిష్కరణ.. ఏంటీ సోలార్ హీటెడ్ టెంట్, ఉపయోగాలేంటి..
సోనమ్ వాంగ్ చుక్ అనేక పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలు చేశారు. అందులో ఈ సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్ ఒకటి.

Solar Heated Tent: సోనమ్ వాంగ్ చుక్.. ప్రముఖ ఆవిష్కర్త, విద్యావేత. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ”3 ఇడియట్స్” లో ఆమిర్ ఖాన్ పోషించిన ఫున్సుక్ వంగుడు పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ నుండి ప్రేరణ పొందిందని అందరికీ తెలుసు. లడఖ్ ప్రాంతంలోని సియాచిన్, గాల్వన్ లోయ వంటి అత్యంత చల్లని ప్రదేశాల్లో ఆర్మీ సిబ్బంది ఉపయోగించగల పర్యావరణ అనుకూలమైన సోలార్ హీటెడ్ టెంట్‌ను వాంగ్ చుక్ అభివృద్ధి చేశారు.
వాంగ్ చుక్.. అనేక పర్యావరణ అనుకూల ఆవిష్కరణలు కనుగొన్నారు. సోలార్ హీట్ తో పని చేసే మిలటరీ టెంట్ శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే పర్యావరణంపై దాని దుష్ప్రభావాలు ఉండవు. అలాగే సైనిక సిబ్బంది భద్రతను పెంచుతుంది. “ఈ టెంట్ పగటిపూట సౌరశక్తిని ఉపయోగించుకుని రాత్రి పూట వెచ్చగా ఉంచుతుంది. శిలాజ ఇంధనం వాడకం లేనందున ఇది డబ్బు ఆదా చేస్తుంది. ఉద్గార రహితంగా ఉంటుంది” అని వాంగ్ చుక్ తెలిపారు. మిలిటరీ టెంట్ లోని స్లీపింగ్ ఛాంబర్ లో టెంపరేచర్ ను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చని ఆవిష్కర్త వాంగ్ చుక్ చెప్పారు.
“స్లీపింగ్ చాంబర్‌లో నాలుగు పొరల ఇన్సులేషన్ ఉంది. బయటి ఉష్ణోగ్రత మైనస్ 14 డిగ్రీల సెల్సియస్ ఉన్నప్పుడు ఇది 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఇచ్చింది. వెచ్చని ప్రదేశాలకు పొరల సంఖ్యను తగ్గించవచ్చు” అని ఆయన వెల్లడించారు. టెంట్ లోపల ఉష్ణోగ్రత చాలా హాయిగా ఉండకూడదని మిస్టర్ వాంగ్‌చుక్ అన్నారు.
Also Read: లోహాన్ని బంగారంగా మార్చగలమంటున్న అమెరికా స్టార్టప్.. ఎలాగంటే?
ఎందుకంటే.. గల్వాన్ లోయ వంటి ప్రదేశాలలో ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది, అటువంటి ప్రదేశాల్ో శత్రువులతో పోరాడటానికి సైనికులు సిద్ధంగా ఉండాలని వివరించారు. సోనమ్ వాంగ్ చుక్ అనేక పర్యావరణ అనుకూలమైన ఆవిష్కరణలు చేశారు. అందులో ఈ సోలార్ హీటెడ్ మిలిటరీ టెంట్ ఒకటి. లడఖ్ ప్రాంతంలోని సియాచిన్ గాల్వన్ లోయ వంటి అత్యంత శీతల ప్రదేశాల్లో ఆర్మీ సిబ్బందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
* ఈ సోలార్ హీటెడ్ టెంట్ పోర్టబుల్.
* 10 మంది సైనికులకు వసతి కల్పించగలదు.
* టెంట్ లోని ఏ భాగం కూడా 30 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండదు.
* ఇది దానిని సులభంగా తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది.
* టెంట్‌ను 30 నుండి 40 భాగాలుగా విడదీస్తారు.
* సూపర్‌లైట్ అల్యూమినియం పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా టెంట్ భాగాల బరువును ఒక్కొక్కటి 20 కిలోలకు తగ్గించొచ్చు.
* సౌరశక్తితో పని చేసే ఈ టెంట్‌ను.. సైన్యం అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
* ఇది ఏటా 500 టన్నుల కార్బన్ డయాక్సైడ్, కోట్ల రూపాయలను ఆదా చేస్తుంది.