Sonia letter Modi : వ్యాక్సిన్ అమ్మకాలపై ప్రధాని మోడీకి సోనియా లేఖ
కరోెనా వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆమె కోరారు.

Sonia Gandhis Letter To Pm Modi On Corona Vaccine Sales
Sonia’s letter to PM Modi : కరోెనా వ్యాక్సిన్ అమ్మకాలపై సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల వయసున్న వారందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోడీకి ఆమె ఓ లేఖ రాశారు. వ్యాక్సిన్ ఒక్కో డోసుకు ఒక్కొక్కరికి..ఒక్కో రేటును సీరమ్ నిర్ణయించడాన్ని ఆమె తప్పుబట్టారు.
కేంద్రానికి 150 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వానికి 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలు ధర నిర్ణయించడమేమిటని ఆమె ప్రశ్నించారు. ఈ ధరలతో సామాన్య పౌరులపైనా, రాష్ట్ర ప్రభుత్వాలపైనా భారం పడుతుందని సోనియా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే కంపెనీ తయారు చేసే వ్యాక్సిన్‌పై ఇన్ని రకాల ధరలు ఎందుకు అమలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత, పడకల కొరత వేధిస్తోందని ఇలాంటి సమయాల్లో వ్యాక్సిన్ అమ్మకంతో ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. వ్యాక్సిన్ కొనే పరిస్థితి సామాన్యులకు లేదని చెప్పారు. ఆర్థిక అసమానతలతో సంబంధం లేకుండా అందరికీ వ్యాక్సిన్ అందించే బాధ్యతను కేంద్రం తీసుకోవాలని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు.