Delhi : కేజ్రీవాల్‌తో సోనూసూద్ భేటీ, కారణం ఇదే
ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది.

Sonu
Sonu Sood And Arvind Kejriwal : సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు పోషించి ఎంతో మందిని మెప్పించిన నటుడు సోనూ సూద్. కానీ నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు. కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందారు. ఈయన రాజకీయాలకు వస్తారా ? ప్రచారం జరుగుతున్న క్రమంలో…ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సోనూ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా ? కేజ్రీవాల్ కు మద్దతు పలుకుతారా ? అనే తెగ చర్చలు జరిగాయి. వీరిద్దరి భేటీ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
Read More : WHO BP Guidelines :మారిన బీపీ లెక్కలు..ఇకనుంచి 140/90 లోపు ఉంటే నార్మల్ :WHO మార్గదర్శకాలు
అయితే..ఈ భేటీ వెనుక ఓ కారణం ఉంది. ఢిల్లీ సర్కార్ త్వరలో ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. దీనికి సోనూసూద్ ను బ్రాడ్ అంబాసిడర్ గా నియమించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా 2021, ఆగస్టు 27వ తేదీ శుక్రవారం ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో నటుడు సోనూ సూద్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు.
Read More : Vijaya Diagnostic Centre: ఐపీఓకు రూ.1895కోట్లతో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్
త్వరలోనే ‘దేశ్ కే మెంటర్స్’ అనే కార్యక్రమం చేపడుతున్నట్లు, దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని తాము సోనూ సూద్ ను కోరడం జరిగిందన్నారు సీఎం కేజ్రీవాల్. దీనికి సోనూ సమ్మతించారని వెల్లడించారు. లక్షలాది మంది విద్యార్థులకు మెంటర్ గా వ్యవహరించే అవకాశం రాడం సంతోషంగా ఉందని సోనూ తెలిపారు.