Swamy Prasad Maurya: నాలుగు చేతులున్న పిల్లల్నీ ఏ తల్లీ కనదు.. ఈసారి లక్ష్మీ దేవిని టార్గెట్ చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

మౌర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. స్వామి ప్రసాదానికి నోటిలో విరేచనాలు అయ్యాయంటూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా స్వామి ప్రసాద్ ప్రసంగాలను నిషేధించాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించారు

Swamy Prasad Maurya: నాలుగు చేతులున్న పిల్లల్నీ ఏ తల్లీ కనదు.. ఈసారి లక్ష్మీ దేవిని టార్గెట్ చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

Updated On : November 13, 2023 / 7:35 PM IST

UP Politics: నిన్నటి వరకు రామచరితమానస్ మీద వ్యాఖ్యలతో వివాదానాకి కారణమైన సమాజ్‭వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరో వివాదానికి తెర లేపారు. ఈసారి లక్ష్మీ దేవి లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అవుతున్నాయి. సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ఆయన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రపంచంలో ఏ జాతి, కులాల పిల్లలైనా రెండు చేతులతోనే పుడతారని, మరి అలాంటప్పుడు లక్ష్మీ నాలుగు చేతులతో ఎలా పుట్టిందంటూ ఆయన ప్రశ్నించారు. మరో అడుగు ముందుకు వేసి.. మీరు పూజ చేయవలసి వస్తే, కుటుంబాన్ని పూర్తి భక్తితో చూసుకునే మీ భార్య కోసం చేయండంటూ సలహా ఇచ్చారు.

మౌర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఆ పార్టీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. స్వామి ప్రసాదానికి నోటిలో విరేచనాలు అయ్యాయంటూ విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా స్వామి ప్రసాద్ ప్రసంగాలను నిషేధించాలంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించారు. దీపావళి సందర్భంగా తన భార్యకు పూజలు చేసి సత్కరించారు స్వామి ప్రసాద్ మౌర్య.

ఆ సమయంలో తీసుకున్న ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ‘‘దీపోత్సవం సందర్భంగా తన భార్యకు పూజలు చేసి సత్కరిస్తూ.. ప్రపంచంలోని అన్ని మతాలు, కులాలు, జాతి, రంగు, దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు రెండు చేతులు, రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు కళ్లు, రెండు ముక్కులు ఉంటాయి. నాలుగు చేతులు, ఎనిమిది చేతులు, పది చేతులు, ఇరవై చేతులు, వెయ్యి చేతులు ఉన్న బిడ్డ ఇప్పటి వరకు పుట్టకపోతే, మని లక్ష్మి నాలుగు చేతులతో ఎలా పుడుతుంది? మీరు లక్ష్మీ దేవిని ఆరాధించాలనుకుంటే, నిజమైన అర్థంలో దేవత అయిన మీ భార్యను పూజించండి, గౌరవించండి. ఎందుకంటే ఆమె మీ కుటుంబ పోషణ, ఆనందం, శ్రేయస్సు, ఆకలి, సంరక్షణ బాధ్యతలను ఎంతో భక్తితో నిర్వహిస్తుంది’’ అని రాసుకొచ్చారు.