మసాజ్ పార్లర్ యాజమానిపై భార్య ఫిర్యాదు

Spa owner’s wife accuses him of assaulting her, having extra-marital affair,Vadodara : గుజరాత్ లోని వడోదరా లో స్పా నిర్వహిస్తున్న వ్యక్తిపై అతని భార్య పోలీసులుకు ఫిర్యాదు చేసింది, తన భర్త వ్యాపార విస్తరణలో భాగంగా వేరోక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్మాడని.. తనపై దాడి చేసి కొట్టాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది.
అకోటాకు చెందిన పరేష్ పటేల్ వడోదరాలో హై ఎండ్ స్పా నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య జిగ్నా, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు పుట్టినప్పటినుంచి పరేష్ భార్యని వేధించసాగాడు. కొన్ని సార్లు భార్యను కొట్టాడు. అయినప్పటికీ ఆమె భర్త పెట్టే భాధలు భరిస్తూ అతనితో కాపురంచేస్తోంది.
2014 లో వ్యాపారాన్ని విస్తరణలో భాగంగా పరేష్ వడోదరా లోమరికొన్ని బ్రాంచ్ లు ఫ్రారంభించాడు. ఆ సమయంలో అతను హన్నా అనే రష్యన్ మహిళ ను పనిలో పెట్టుకున్నాడు. ఆమెకు కొన్ని బ్రాంచ్ ల నిర్వహణ అప్పచెప్పాడు. ఆమెతో వ్యాపార విషయంలో సంప్రదింపులు జరిపే క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అది క్రమేపి వివాహేతర సంబంధంగా మారింది.
వ్యాపార నిర్వహణ పేరుతో ఎక్కువ సమయం పరేష్ హన్నాతోనే గడిపేవాడు. ఇద్దరి మధ్య కామ క్రీడలు ఎక్కువయ్యాయి. వ్యాపారం అభివృధ్దితో పాటు పరేష్ , హన్నాల బంధం కూడా పెరుగుతూ వచ్చింది. వీరి రాసలీలలకు గుర్తుగా 2015లో హన్నా ఒక బిడ్డకు జన్మనిచ్చింది.
మొత్తానికి ఈ సంగతి పరేష్ భార్య జిగ్నా పసి గట్టింది. భర్తను నిలదీసింది. దీంతో పరేష్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది, ఇకపై తన భార్యను మంచిగా చూసుకుంటానని పోలీసులకు హామీ ఇచ్చి కేసు ఉపసంహరించుకునేలా చేశాడు. కొన్నేళ్లు వాళ్ల కాపురం సజావుగా సాగింది.
కాగా గతేడాది జనవరిలో పరేష్ మళ్లీ తన భార్యను తీవ్రంగా కొట్టాడు. జిగ్నాను వదిలివేసి హన్నా తో కలిసి అకోటాలో నివసించడం మొదలు పెట్టాడు. జిగ్నా ముజ్మాహుడాలో విడిగా జీవించటం మొదలెట్టింది. జిగ్నా కొనుకున్న కారును తీసుకువెళ్లి హన్నా కు ఇచ్చాడు. దీంతో జిగ్నా పోలీసులకు ఫిర్యాదుచేసింది, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేప్టటారు.