Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు రెండవసారి బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగింది? కారణాలు ఏంటి..

తలకు దెబ్బ తగలడంతో నేను వెంటనే ఢిల్లీకి వెళ్లి మరో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకున్నాను.

Sadhguru Jaggi Vasudev: సద్గురు జగ్గీ వాసుదేవ్ కు రెండవసారి బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగింది? కారణాలు ఏంటి..

Updated On : July 28, 2025 / 7:28 PM IST

Sadhguru Jaggi Vasudev: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్.. మార్చి 2024లో ఢిల్లీలో అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దానికి దారితీసిన కారణాలను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. బ్రెయిన్ సర్జరీ ఎందుకు జరిగింది? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? బ్రెయిన్ సర్జరీ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికర విషయాలను ఆయన పంచుకున్నారు.

తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘సద్గురు రెండవ మెదడు శస్త్రచికిత్స – వెల్లడించని వివరాలు’ అనే వీడియోలో ఆయన ఇలా గుర్తు చేసుకున్నారు. “నేను నా కుమార్తె కొలనులో ఈత కొడుతున్నాము. ఆ తర్వాత నేను పైకి వచ్చి కుర్చీపై కూర్చున్నాను. అదే సమయంలో ఒక పెద్ద కోతి వచ్చింది. లోపలికి వెళ్లాలనుకుంది. ఎందుకంటే లోపల చాలా పండ్లు ఉన్నాయి. నా కుమార్తె కోతిపై అరిచింది. కోతి నోరు తెరిచి దాడి చేసేందుకు వెనక్కి తిరిగి వచ్చింది.

కోతి కాటు గాయాల గురించి నాకు తెలుసు. అది నా కూతురి వైపు వస్తుండటంతో వెంటనే నేను పైకి లేచాను. నా వాకింగ్ స్టిక్ లోపల ఉంది. దాని కోసం పరిగెత్తాను. అయితే ఎవరో తలుపు మూశారు. దాంతో నేను వేగంగా వెళ్లి గాజు గ్లాసును ఢీకొట్టాను. అప్పుడు చాలా పెద్ద శబ్దం వచ్చింది. ఆ శబ్దంతో కోతి అక్కడి నుంచి పారిపోయింది. నా ప్రయోజనం నెరవేరింది. కానీ ఈ ఘటనలో నా తల పగిలిపోయింది” అని సద్గురు వివరించారు.

సద్గురును అపోలో హాస్పిటల్స్‌లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి పరీక్షించారు. MRI చేయించుకోవాలని సూచించారు. ఎంఆర్ఐ చేయగా మెదడులో వాపు, రక్తస్రావం గుర్తించారు. రక్తస్రావం మెదడు వెలుపల ఎముక కింద ఉందని తేలింది. రెండుసార్లు భారీగా రక్తస్రావం జరిగిందని తెలిపారు.

Also Read: రియల్ లైఫ్ పున్ షుక్ వాంగ్డూ.. ఆర్మీ కోసం సోనమ్ వాంగ్ చుక్ ప్ర్రత్యేక ఆవిష్కరణ.. ఏంటీ సోలార్ హీటెడ్ టెంట్, ఉపయోగాలేంటి..

”తలకు దెబ్బ తగలడంతో నేను వెంటనే ఢిల్లీకి వెళ్లి మరో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకోవాలని అనుకున్నాను. అయితే, ఆ రాత్రి వరకు వేచి ఉండి, ఏవైనా లక్షణాలు కనిపిస్తాయేమో అని చూశాను. నాకు ఏదో ఇబ్బందిగా అనిపించింది. బాగా నొప్పి కలిగింది. దాంతో నేను మరొక శస్త్రచికిత్స కోసం వెళ్ళాను” అని సద్గురు వెల్లడించారు.

”ఆ శస్త్రచికిత్స ఎటువంటి సమస్యలు లేకుండా బాగానే జరిగింది. అయితే శరీరంలో ఏదో తేడా జరిగింది. కణాల్లో మార్పు జరిగింది. ఇది సెప్సిస్ లేదా ఇతర రకాల తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంటేనే జరుగుతుంది. నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు. దాంతో ఏం జరిగిందో డాక్టర్లు అర్థం చేసుకోలేకపోయారు. మూడు రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రి చైర్‌పర్సన్‌తో సహా 14 మంది వైద్యులు అక్కడ నిలబడి ఉన్నారు. వారి కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి. శస్త్రచికిత్స తర్వాత అన్ని అవయవాల వైఫల్యం జరగడం ప్రారంభించిందని, దాంతో నన్ను కోల్పోయారని వారు భావించారు” అని 67 ఏళ్ల సద్గురు గుర్తు చేసుకున్నారు.

దీనికి సంబంధించి డాక్టర్లు కీలక జాగ్రత్తలు చెపపారు. తల గాయాలను ఎప్పటికీ విస్మరించరాదన్నారు. బాగానే ఉన్నట్లు అనిపించినా టెస్టులు చేయించుకోవాలన్నారు. గాయం తర్వాత తలతిరగడం, గందరగోళం, వికారం లేదా సమతుల్యత కోల్పోవడం వంటి లక్షణాలు హెచ్చరిక సంకేతాలు అని నిపుణులు అన్నారు.