Covid-19 : స్పుత్నిక్ – వీ సరఫరా ప్రారంభించిన డా.రెడ్డీస్

స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్లను దేశంలోని వివిధ ప్రాంతాల‌కు సరఫరా చేయడం ప్రారంభించినట్లు హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరెటరీస్‌ తెలిపింది.

Covid-19 : స్పుత్నిక్ – వీ సరఫరా ప్రారంభించిన డా.రెడ్డీస్

Covid 19

Updated On : September 8, 2021 / 7:54 AM IST

Covid-19 : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. గతంలో వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండేది.. వ్యాక్సిన్ తయారి కంపెనీలు వేగం పెంచడంతో టీకా కొరత తీరింది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. స్పుత్నిక్ – వీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.

స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్లను దేశంలోని వివిధ ప్రాంతాల‌కు సరఫరా చేయడం ప్రారంభించినట్లు హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరెటరీస్‌ తెలిపింది. దేశ వ్యాప్తంగా డా.రెడ్డీస్ ల్యాబొరేటరీస్ భాగస్వామ్య ఆసుపత్రులకు పంపిణి చేసినట్లు తెలిపారు. ఇక వ్యాక్సిన్ వ్యాక్సిన్ లభ్యత గురించి తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ నుంచి సరఫరా అవాంతరాలు తలెత్తడంతో స్పుత్నిక్-వీ సరఫరాను గతంలో డాక్టర్ రెడ్డిస్ నిలిపివేసింది. మరో ఫార్మా కంపెనీ పానేసియా బయోటెక్‌.. ఆర్‌డీఐఫ్‌తో స్పుత్నిక్‌-వీ రెండో డోసు విక్రయిస్తున్నట్లు ప్రకటన వెలువడిన నేపథ్యంలో డాక్టర్‌ రెడ్డీస్‌ ఈ వ్యాక్సిన్‌ సరఫరాలు ప్రారంభించడం గమనార్హం.