NCPCR ఆదేశం : జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ సేల్స్ నిలిపివేయండి
జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) షాక్ ఇచ్చింది.

జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) షాక్ ఇచ్చింది.
జాన్సన్ అండ్ జాన్సన్స్ కంపెనీకి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం (NCPCR) షాక్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ, పౌడర్ అమ్మకాలను నిలిపివేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఎన్ సీపీసీఆర్ లేఖ పంపింది. షాపుల్లోని జాన్సన్ ఉత్పత్తులను కూడా వెంటనే వెనక్కి పంపాలని లేఖలో ఆదేశించింది. జాన్సన్ ఉత్పత్తుల శాంపిల్స్ ను పరీక్షలకు పంపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీ, రాజస్థాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అసోం రాష్ట్రాల జాన్సన్ ఉత్పత్తుల నమూనాలను పరిశీలించి నివేదికలు పంపాలని ఎన్ సీపీసీఆర్ ఆదేశించింది. అయితే NCPCR ఆదేశాలు తమ దృష్టికి రాలేదని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వెల్లడించింది.
సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీలో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని జాన్సన్ కంపెనీ స్పష్టం చేసింది. జైపూర్ లెబోరేటరీ నివేదికను ఎన్ సీపీసీఆర్ కు రాజస్థాన్ ప్రభుత్వం అందజేసింది. జాన్సన్స్ ఉత్పత్తుల్లో ఫార్మల్ డీహైడ్ ఉందని, నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.