Delhi Earthquake: భూకంపం వచ్చి జనం భయంతో వణుకుతుంటే… వీళ్ల కామెడీ చూడండి..

ఎక్స్‌లో చాలా మంది ఇటువంటి ట్రెండుకు తగ్గ ఫొటోలు పెడుతూ సెటైర్లు వేసుకున్నారు.

Delhi Earthquake: భూకంపం వచ్చి జనం భయంతో వణుకుతుంటే… వీళ్ల కామెడీ చూడండి..

Updated On : February 17, 2025 / 4:09 PM IST

ఢిల్లీలో భూకంపం వచ్చి జనం భయంతో వణుకుతుంటే సామాజిక మాధ్యమాల్లో కొందరు మీమ్స్‌ సృష్టిస్తూ కామెడీ చేస్తున్నారు. ఢిల్లీతో పాటు నోయిడా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కొన్ని క్షణాలు భూమి కంపించిన విషయం తెలిసిందే. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైందని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

భూకంపంపై కూడా కొందరు నెటిజన్లు మీమ్స్‌ సృష్టించారు. భూకంపం ప్రజలను ఒక్కసారిగా గజగజ వణికిస్తుంటే దీనిని నెటిజన్లు వినోదంగా చూస్తూ మీమ్స్‌ వదులుతుండడంపై విమర్శలు కూడా వస్తున్నాయి.

భూకంపం సంభవించిన కొన్ని గంటల్లోనే సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలు మీమ్స్‌తో నిండిపోవడం గమనార్హం. సాధారణంగా విపత్తు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రయత్నాలు జరుపుతారు.

Also Read: శుభవార్త.. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. జారీపై సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

ఇప్పుడు ట్రెండ్ మారిందా అన్నట్లు ఏ ఘటనపై అయినా సరే మీమ్స్‌ ద్వారా హాస్యాన్ని వెదజల్లుతున్నారు. మీమ్స్‌ను ఎంతో క్రియేటివిటీతో సృష్టిస్తున్నారు. భూకంపం వస్తే వణికిపోవడం మానేసి ముందు దానిపై స్టేటస్‌ పెట్టాలనేలా జనాలు మారిపోయారు.

భూకంపం వచ్చినప్పటికీ నిద్రను మాత్రం వదలం అన్నట్లు కొందరు మీమ్స్ సృష్టించారు. భూకంపంలోనూ డ్యాన్స్ చేస్తున్నట్లు మరికొందరు మీమ్స్‌ సృష్టించారు. భూకంపం మామూలే అన్నట్లు కొందరు వ్యవహరిస్తున్నారని కొందరు నెటిజన్లు జోకులు వేసుకున్నారు.

ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లలో చాలా మంది ఇటువంటి ట్రెండుకు తగ్గ ఫొటోలు పెడుతూ సెటైర్లు వేసుకున్నారు. సాధారణంగా మీమ్స్ ప్రజల్ని మానసికంగా రిలాక్స్‌ చేయడంలో సహాయపడతాయి. కానీ, ప్రమాదాన్ని తక్కువగా అర్థం చేసుకునేలా వస్తున్న ఇటువంటి మీమ్స్‌ ఏ సందేశాన్ని ఇస్తాయో.