హ్యాట్సాఫ్ సైనికా : ఐదుగురు ఆర్మీ అధికారులకు శౌర్యచక్ర అవార్డులు

దేశానికి అనితరసాధ్యమైన సేవలు అందించిన వీర సైనికులకు భారత ప్రభుత్వం శౌర్యచక్ర అవార్డులను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకల్లో వీర సైనికులను సత్కరించుకోవటం మన భాద్యత. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ఆర్మీ అధికారులకు ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డులను ప్రకటించింది. లెఫ్టినెంట్ కల్నల్ జ్యోతి లామా, మేజర్ కెబి సింగ్, సుబేదార్ ఎన్ సింగ్, నాయక్ ఎస్ కుమార్ మరియు సిపాయి కె ఒరాన్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శౌర్యచక్ర అవార్డులను ప్రదానం చేస్తారు.
ప్రాణాలకు తెగించి ఉగ్రవాదలపై జేబేదార్ సోంబిర్ కాల్పులు
జాట్ రెజిమెంట్‌లో ఉన్న నాయక్ సుబేదార్ సోంబిర్‌కు.. మరణాణంతరం శౌర్య చక్రను ప్రకటించారు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఆపరేషన్‌లో సుబేదార్ సోంబిర్.. ఉగ్రవాదులపై తొమ్మిది గ్రనేడ్లను కాల్చి ఇద్దరు ఉగ్రవాదులను తుదముట్టించారు. మరో నలుగురు ఉగ్రవాదుల దాడులను తన ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు.
14మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన కల్నల్ జ్యోతిలామా
2019తో మణిపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులను చంపిన లెఫ్టినెంట్ కల్నల్ జ్యోతి లామాకు శౌర్య చక్ర ప్రకటించారు.14 మంది ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో కల్నల్ జ్యోతి లామా కీలక పాత్ర పోషించారు.
బుల్లెట్ దిగినా..ప్రాణాలకు తెగించి డియో ఓరన్
లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కీలక ఆపరేషన్ చేపట్టిన సిపాయ్ కర్మ్ డియో ఓరన్ కూడా శౌర్య చక్ర గెలుచుకున్నారు. తనకు బుల్లెట్ దిగినా.. ఉగ్రవాదులపై తొమ్మిది గ్రేనేడ్లు వదిలి, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.
పారాచూట్ రెజిమెంట్‌కు చెందిన నాయిబ్ సుబేదార్ నరేంద్ర సింగ్‌కు కూడా శౌర్య చక్రను ప్రకటించారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద నరేంద్ర సింగ్ ఇద్దరు ఉగ్రవాదులను చంపేశారు. ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులను అతను హతమార్చారు.
దేశానికి ఎనలేని సేవలు చేసిన మన భారత వీరసైనికులకు ఎన్ని అవార్డులు ఇచ్చినా..వారి త్యాగాల గురించి ఎంతగా చెప్పుకున్నా తక్కువే. కానీ దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వీరులను సన్మానించుకోవటం మన బాధ్యత. దేశ గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈ అవార్డులు ప్రధానం చేయబడతాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు వందనం..పాదాభివందనం..