Supreme Court : మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Supreme Court : మనీష్ సిసోడియాకి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

Supreme Court denied bail

Updated On : October 30, 2023 / 11:34 AM IST

Supreme Court Denied Bail : సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియాకి చుక్కెదురైంది. మనీష్ సిసోడియకి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. లిక్కర్ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపించినందున సిసోడియా బెయిల్ ను తిరస్కరించింది. లిక్కర్ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

విచారణ నెమ్మదిగా సాగితే, సిసోడియా మూడు నెలల్లోపు మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీ ఎన్ భట్టి ధర్మాసనం తీర్పు వెలువరించింది. రూ. 338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఒక అంశాన్ని ఈడి ఆధారంగా చూపించిందని జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు.

Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం

విచారణ సందర్భంగా తాము లేవనెత్తిన చాలా అంశాలకు ఎవరి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. కొన్నింటికి సమాధానం ఇచ్చినా అది సంతృప్తి కరంగా లేదని వ్యాఖ్యానించారు. దీంతో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను కొట్టివేశామని పేర్కొన్నారు.

లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.