తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌కు సుప్రీంకోర్టు 4 వారాల గడువు
ఇక నాలుగు వారాల్లో విచారణ పూర్తిచేయాల్సిందేనని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు.
Supreme Court
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరింత సమయం ఇచ్చింది. నాలుగు వారాల గడువు ఇస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
రోజువారీ విచారణ జరపాలని గత విచారణలోనే ఆదేశాలు ఇచ్చామని, ఇక నాలుగు వారాల్లో విచారణ పూర్తిచేయాల్సిందేనని జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: సమయం ఆసన్నమైంది.. వన్ ప్లస్ నుంచి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే వదలరు..
ఈ విషయాన్ని స్పీకర్‌కు తెలియజేస్తామని స్పీకర్ తరఫు న్యాయవాదుల చెప్పారు. స్పీకర్ కోరిన అదనపు సమయ పిటిషన్‌తో పాటు ధిక్కరణ పిటిషన్లను ధర్మాసనం ఒకేసారి విచారించింది.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జులై 31న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఆలోపు నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని, మరో 2 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి మిసిలేనియస్ అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది.
