40 Storey Tower : ఆ భవనాలు కూల్చాల్సిందే తేల్చి చెప్పిన సుప్రీం కోర్టు
రియాల్టీ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆ టవర్లను కూల్చివేయాలంటూ తేల్చి చెప్పింది అత్యున్నత న్యాయస్థానం.

40 Storey Tower
40 Storey Tower : రియాల్టీ సంస్థ సూపర్‌టెక్ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నోయిడాలో కంపెనీ నిర్మించిన రెండు 40 అంతస్తుల భవంతులను పడగొట్టాల్సిందిగా ఆగస్టు31న ఆదేశించి సుప్రీం కోర్టు.. ఆ ఆదేశాలను సవరించాలని కోరుతూ సూపర్‌టెక్ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రెండు టవర్లను కూల్చడం కంటే ఒక టవర్‌లోని 224 ఫ్లాట్లను, వాటి కమ్యూనిటీ ఏరియాను కూల్చేస్తామని తన పిటిషన్‌లో సూపర్‌టెక్ తెలిపింది. ఇతర అప్లికేషన్లు, స్పష్టత కోసం వేసిన అప్లికేషన్ల రూపంలో ఉన్న ఈ పిటిషన్ తీర్పుపై సమీక్ష కోరకూడదంటూ కొట్టేసింది కోర్టు.
Read More : Night Sleep : రాత్రిళ్ళు సరిగా నిద్రపోకపోతే జరిగేది ఇదే…
అయితే నిర్మాణ సంస్థ మాత్రం కూల్చివేత విషయంపై ఆలోచనలో పడింది. చుట్టూ నివాసాలు ఉండటంతో బాంబులు పెట్టి కూల్చడం కుదరదని.. ఇటుక ఇటుక తీసి కూల్చాలంటే చాలా ఖర్చు అవుతుందని.. ఇప్పటికే నిర్మాణం కోసం చాలా ఖర్చు చేశామని.. మరింత ఖర్చు కాకుండా ఉండేందుకు తీర్పుపై సమీక్ష కోరినట్లు తెలిపింది సంస్థ. ఈ రెండు టవర్లు నోయిడా భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వాటిని కూల్చేయాల్సిందే అంటూ ఆగస్ట్ 31న తీర్పు వెలువరించింది.
Read More : Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..