Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. మాల్ వేర్ లతో అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఫేక

Android Apps : మొబైల్ యూజర్లకు వార్నింగ్.. వెంటనే ఈ 26 యాప్స్ డిలీట్ చేయండి..

Android Apps

Android Apps : సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో నేరాలకు తెగబడుతున్నారు. మాల్ వేర్ లతో అడ్డంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్ లతో సైబర్ క్రిమినల్స్ బురిడీ కొట్టిస్తున్నారు. దీనికి సంబంధించి గూగుల్ ఎప్పటికప్పుడు తన యూజర్లను అలర్ట్ చేస్తూనే ఉంది. మాల్ వేర్ యాప్స్ ను గుర్తించి వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగిస్తోంది.

అలాగే, మొబైల్ యూజర్లు ఒకవేళ తమ ఫోన్ లో వాటిని ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే డిలీట్ చేయాలని సూచిస్తుంది. తాజాగా గూగుల్ మరోసారి మొబైల్ యూజర్లను అలర్ట్ చేసింది. 26 యాండ్రాయిడ్ యాప్స్ ను బ్యాన్ చేసింది. గ్రిఫ్ట్ హార్స్ యాండ్రాయిడ్ ట్రోజన్ కలిగున్న ఆ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే వెంటనే డిలీట్ చేయాలని కోరింది. 26 యాప్ ల ద్వారా యూజర్ల డబ్బును హ్యాకర్లు కాజేస్తున్నట్టు గూగుల్ గుర్తించింది.

Covid Victims : మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..కోవిడ్‌‌తో చనిపోయిన ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదు

గూగుల్ నిషేధించిన మాల్ వేర్ యాప్స్..
* హ్యాండీ ట్రాన్స్ లేటర్ ప్రో
* హార్ట్ రేట్
* పల్స్ ట్రాకర్
* జియోస్పాట్
* జీపీఎస్ లొకేషన్ ట్రాకర్
* ఐకేర్-ఫైండ్ లొకేషన్
* మై చాట్ ట్రాన్స్ లేటర్
* బస్-మెట్రోలిస్ 2021
* ఫ్రీ ట్రాన్స్ లేటర్ ఫొటో
* లాకర్ టూల్
* ఫింగర్ ఛేంజర్
* కాల్ రీకోడర్ ప్రో

స్మార్ట్ ఫోన్ యూజర్లు ఒకసారి తాము డౌన్ లోడ్ చేసిన యాప్స్ చెక్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. ఎందుకంటే, మాల్ వేర్ కలిగిన యాప్స్ ను మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. చాలా ఫోన్లలో ప్రమాదకర యాండ్రాయిడ్ యాప్స్ ఉన్నట్టు గూగుల్ గుర్తించింది. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు ఒకసారి తమ ఫోన్ చెక్ చేసుకోవాలని, ప్రమాదకర యాప్స్ ఉంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని చెప్పింది. గూగుల్ హెచ్చరించిన యాప్స్ ను డిలీట్ చేయనంతవరకు భారీ ప్రమాదం పొంచి ఉన్నట్టే అని చెప్పింది.

Flubot Malware : సెక్యూరిటీ అప్‌డేట్ అని మేసేజ్ వచ్చిందా? అయితే జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే

సెక్యూరిటీ ఫర్మ్ జింపేరియమ్ జెడ్ ల్యాబ్స్.. గ్రిఫ్ట్ హార్స్ యాండ్రాయిడ్ ట్రోజన్ మాల్ వేర్ ను గుర్తించింది. ఈ మాల్ వేర్ అనేక ఆండ్రాయిడ్ యాప్స్ లో ఉందని, ట్రోజన్ గా వ్యవహరిస్తోందని వివరించింది. ఈ మాల్ వేర్ కారణంగా ఆండ్రాయిడ్ డివైజ్ లకు ప్రమాదం పొంచి ఉందని చెప్పింది. ఈ యాప్స్ కారణంగా అనేక మంది యూజర్లు పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయారని తెలిపింది. గిఫ్ట్ లు, ఉచిత ప్రైజ్ ల పేరుతో గ్రిఫ్ట్ హార్స్ యాండ్రాయిడ్ ట్రోజన్ ద్వారా హ్యాకర్లు యూజర్లను మోసం చేస్తున్నారు. నకిలీ లింక్ లు పంపి డబ్బు దోచుకుంటున్నారు.

App Name Minimum Downloads Maximum Downloads
Handy Translator Pro 5,00,000 10,00,000
Heart Rate and Pulse Tracker 1,00,000 5,00,000
Geospot: GPS Location Tracker 1,00,000 5,00,000
iCare – Find Location 1,00,000 5,00,000
My Chat Translator 1,00,000 5,00,000
Bus – Metrolis 2021 1,00,000 5,00,000
Free Translator Photo 1,00,000 5,00,000
Locker Tool 1,00,000 5,00,000
Fingerprint Changer 1,00,000 5,00,000
Call Recoder Pro 1,00,000 5,00,000
Instant Speech Translation 1,00,000 5,00,000
Racers Car Driver 1,00,000 5,00,000
Slime Simulator 1,00,000 5,00,000
Keyboard Themes 1,00,000 5,00,000
What’s Me Sticker 1,00,000 5,00,000
Amazing Video Editor 1,00,000 5,00,000
Safe Lock 1,00,000 5,00,000
Heart Rhythm 1,00,000 5,00,000
Smart Spot Locator 1,00,000 5,00,000
CutCut Pro 1,00,000 5,00,000
OFFRoaders – Survive 1,00,000 5,00,000
Phone Finder by Clapping 1,00,000 5,00,000
Bus Driving Simulator 1,00,000 5,00,000
Fingerprint Defender 1,00,000 5,00,000
Lifeel – scan and test 1,00,000 5,00,000
Launcher iOS 15 1,00,000 5,00,000