Supreme Court: అక్రమ కాలనీలతో పట్టణాభివృద్ధికి ఆటంకం: సుప్రీం కోర్టు

దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్దికి పెను ముప్పుగా మారుతున్నాయని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది.

Supreme Court: అక్రమ కాలనీలతో పట్టణాభివృద్ధికి ఆటంకం: సుప్రీం కోర్టు

Supreme Court

Updated On : April 25, 2022 / 7:52 PM IST

Supreme Court: దేశవ్యాప్తంగా పలు నగరాల్లో వెలుస్తున్న అక్రమ కాలనీలు పట్టణాభివృద్దికి పెను ముప్పుగా మారుతున్నాయని అభిప్రాయపడింది సుప్రీం కోర్టు. అక్రమ కాలనీలు పెరగకుండా రాష్ట్రాలు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించింది. నగరాల్లో ఏర్పడుతున్న అక్రమ కాలనీలను అడ్డుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలు సూచించాలంటూ సుప్రీంకోర్టు బెంచ్ ఆధ్వర్యంలో ఒక సలహా సంఘం ఏర్పాటైంది. ఈ సందర్భంగా అక్రమ కాలనీలపై బెంచ్ సోమవారం పలు వ్యాఖ్యలు చేసింది.

‘‘అక్రమ కాలనీలు పెరుగిపోతుండటం వల్ల నగరాలకు పలు సమస్యలు వస్తున్నాయి. హైదరాబాద్, కేరళలో వరదలకు అక్రమంగా వెలసిన కాలనీలే కారణం. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని అడ్డుకునేందుకు సరైన ప్రణాళిక చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాంటివి పెరుగుతూనే ఉంటాయి. అవసరమైతే అలాంటివాటి రిజిస్ట్రేషన్లు ఆపేయాలి’’ అని సూచించింది. దీనికి సంబంధించి కోర్టు ఆధ్వర్యంలో ప్రశ్నావళి, సర్క్యులర్ రూపొందించినట్లు తెలిపింది. వీటిని రాష్ట్రాలకు అందజేస్తామని కోర్టు తెలిపింది.