Noida Lawyer: భర్త చేతిలో సుప్రీంకోర్టు న్యాయవాది దారుణ హత్య
లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు.

Noida Lawyer Renu Sinha
Husband Killed Lawyer : ఉత్తరప్రదేశ్ నోయిడాలో (Noida) దారుణం జరిగింది. 61 ఏళ్ల మహిళా న్యాయవాది భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయవాది రేణు సిన్హా (Renu Sinha) తన భర్త నితిన్ నాథ్ సిన్హాతో కలిసి నోయిడా సెక్టార్ 30లోని బంగ్లాలో నివసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆమె కనపించకుండా పోయారు. రేణు సోదరుడు ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన సోదరిని ఆమె భర్తే హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
లాయర్ బంగ్లాలో వెతకగా బాత్ రూమ్ లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె భర్త నితిన్ మాత్రం కనపించలేదు. దీంతో అతడి కోసం గాలించగా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరికి నితిన్ ఫోన్ నెంబర్ ట్రాక్ చేయగా అది లాయర్ బంగ్లా వద్ద చూపించింది. దీంతో పోలీసులు బంగ్లా మొత్తం వెతకగా స్టోర్ రూమ్ లో కనిపించాడు.
Suspicious Death : నందివాడ ఎస్సై శిరీష భర్త అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం
ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, నితిన్ తన భార్యను చంపిన తర్వాత సుమారు 36 గంటలపాటు స్టోర్ రూమ్ లోనే దాక్కున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తమ బంగ్లాను విక్రయించే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలే రేణు సిన్హా హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. తమ బంగ్లాను విక్రయించాలని భావించిన నితిన్ నాథ్ కొనుగోలుదారు నుంచి టోకెన్ మొత్తాన్ని కూడా తీసుకున్నట్టు వెల్లడించారు. బంగ్లాను అమ్మేందుకు తన భార్య ఒప్పుకోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వివరించారు.