సుప్రీం ఆదేశాలు : కార్లు, బైకులు రీ మోడల్ చేస్తే నంబర్ మాయం

  • Published By: veegamteam ,Published On : January 10, 2019 / 07:12 AM IST
సుప్రీం ఆదేశాలు : కార్లు, బైకులు రీ మోడల్ చేస్తే నంబర్ మాయం

ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయంలో కేరళ హైకోర్టు  కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కేరళ హైకోర్టు నిర్ణయాన్ని మంగళవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, వినీత్ శరణ్ ఈ తీర్పును ఆమోదించారు.ఆర్టీయే ఆఫీసులో జరిగిన రిజిస్టర్ అయిన ఏ వాహనమైన కార్లు,బైక్, ట్రక్కు, బస్ మొదలైనవి వెహికల్స్ కు స్పెషల్ ఎట్రాక్షన్ కోసం రీమోడల్ చేయించుకునే విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో కాస్త ఆలోచించాల్సిన అవసరముంది. 

మోటారు వాహన చట్టం యొక్క సెక్షన్ 52 (1) ప్రకారం ఏ వాహనం అయినా రిజిస్ట్రేషన్ చేయబడిందని కొత్త పాలనా యంత్రాంగం తెలిపింది. ఈ తీర్పు ప్రధానంగా కార్ల మరియు బైకుల మార్పు, ఇంజిన్లను మార్చడం అనేది చట్టవిరుద్ధం అని తెలిపింది. దీనికి వ్యతిరేకంగా రీమోడల్ చేసిన క్రమంలో ఆర్టీఏ ఆఫీస్ లో రిజిస్ట్రర్ అయిన నంబర్ ను కోల్పోవాల్సి వుంటుంది. దీంతో తిరిగి మరోసారి రిజిస్టర్ చేయించుకోవాల్సిన అవసరముంది. 

మార్పులు  పరిమితం..
వెహికల్స్ కలర్ లో చిన్న చిన్న మార్పులో చేసుకోవాచ్చు..కానీ వెహికల్ స్ట్రక్చర్ అంటే ఇంజన్ మార్పులు (కొందరు వెహికల్ కొన్న తరువాత ఇంజన్ సీసీ పెంచుకునేలా ఇంజన్ మారుస్తుంటారు)..కుదరవని తేల్చింది ధర్మాసనం. ఒకవేళ మార్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ అధికారుల నుండి (ఆర్టీఏ) నుంచి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. లేని క్రమంలో వెహికల్ రిజిస్ట్రేషన్ కాన్సిల్ అవుతుంది. ఈ నిబంధనల్లో టైర్స్ మార్చటానికి వీల్లేదు ( కొందరు హెవీ టైర్స్ వేయించుకోవటం) వంటివి కుదరదని తెలిపింది. 
సెక్యూరిటీ పరంగా ఇటువంటి మార్పులు అనుమతించబడవనీ..అలా మార్పులు చేయటం వల్ల పాత వాహనం..కొత్తగా మోడిఫై చేసుకున్న వాహనానికి డిఫరెన్స్ తెలీయకపోవటం సమస్యలు వచ్చే అవకాశమందని జస్టిస్ మిశ్రా తెలిపారు. సీఎన్జీ వస్తు సామగ్రి ( వెహికల్ తో పాటు  ఇచ్చే టూల్ కిట్)తో కార్స్ రెట్రో ఫిట్మెంట్స్ చట్టం ప్రకారం అనుమతించబడతాయని సుప్రీంకోర్ట్ బెంచ్ పేర్కొంది. దీంతో వెహికల్ కొని రిజిస్ట్రేషన్ అనంతరం చిన్న చిన్న మార్పులే తప్ప భారీ మార్పులు చేపడితే రంగు పడుద్దన్నమాట.