Quran Surahs case : ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలని పిటిషన్..తిరస్కరించిన సుప్రీం..పిటిషన్ దారుడికి భారీ ఫైన్!

పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి 26 పద్యాలను (సూరాలు) (Surah)తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ పూర్తిగా అవివేకమైనదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ ను దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధించింది సుప్రీంకోర్టు.

Quran Surahs case : ఖురాన్ నుంచి 26 పద్యాలను తొలగించాలని పిటిషన్..తిరస్కరించిన సుప్రీం..పిటిషన్ దారుడికి భారీ ఫైన్!

Quran Surahs

Updated On : April 13, 2021 / 4:26 PM IST

Supreme court dismisses to remove 26 verses from Quran : ముస్లింలకు అత్యంత పవిత్రమైన గ్రంథం ఖురాన్. అటువంటి ఖురాన్ ను వారు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఖురాన్ లోని విషయాలను ముస్లిం సోదరులు తమ జీవితాలకు ఆపాదించుకుంటారు. వాటిని పాటించాలను కోరుకుంటారు. అటువంటి పవిత్ర గ్రంథమైన ఖురాన్ నుంచి 26 పద్యాలను (సూరాలు) (Surah)తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఈ పిటిషన్ పూర్తిగా అవివేకమైనదని వ్యాఖ్యానించింది. జస్టిస్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేశ్ లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఈ పిటిషన్ ను దాఖలు చేసిన ఉత్తరప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధించింది సుప్రీంకోర్టు.

పిటీషన్ లో వివరాల్లోకొస్తే..ఖురాన్ లోని 26 పద్యాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని వాటిని తొలగించాలని పిటిషన్ లో రిజ్వీ పేర్కొన్నారు. ఈ పద్యాలు కొందరిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని… అందువల్ల వీటిని ఖురాన్ నుంచి తొలగించాలని కోరారు. ఇస్లాం మతం క్షమాగుణం, సమానత్వం, ధర్మం, సహనంపై ఆధారపడి ఉంటుందని… అయితే, కొందరు వ్యక్తులు ఈ పద్యాలను ఆధారంగా చేసుకుని ఇస్లాంకు తప్పుడు అర్థాన్ని చెపుతున్నారని తెలిపారు.

ఈ పద్యాల వల్ల ఇస్లాం అసలు స్వభావం నుంచి దూరమవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. ఇది అవివేకమైన పిటీషన్ అని వ్యాఖ్యానించింది. దీంతో ధర్మాసనం పిటిషన్ ను కొట్టి వేస్తూ, పిటీషన్ వేసిన జరిమానా వసీం రిజ్వీకి రూ. 50 వేల జరిమానా విధించింది.