Supreme Court: ఢిల్లీ ఆర్డినెన్సు అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీం కీలక ఆదేశాలు
గురువారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

Centre ordinance: ఢిల్లీలోని అధికారులను నియంత్రించేందుకు కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ శాసనసభ పరిధి నుంచి సేవలను మినహాయించడం సరైనదేనా అనే దానిపై సుదీర్ఘ విచారణ అవసరమని ప్రధాన న్యాయమూర్తి గురువారం (జూలై 20) అన్నారు. ఈ ఆర్డినెన్సును కేంద్ర ప్రభుత్వం మే 19న జారీ చేసింది.
Manipur Violence: మణిపూర్ దారుణ వీడియో ఘటన.. ఎట్టకేలకు కీలక నిందితుడి అరెస్ట్
ఢిల్లీ ఎల్జీ తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినెన్స్ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉండదని అన్నారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ అప్పటి వరకు వేచి ఉండలేమని అన్నారు. రాజ్యాంగ ధర్మాసనంలో త్వరగా విచారణ జరపాలని ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశాలను సాయంత్రంలోగా అప్‌లోడ్ చేస్తామని చెప్పారు. విచారణ తేదీని కూడా అందులో పేర్కొననున్నారు.
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. కేంద్రం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌లో, డానిక్స్ క్యాడర్‌లోని గ్రూప్-ఏ అధికారులపై క్రమశిక్షణా చర్యలు, బదిలీల కోసం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది.
Dera chief: డేరా బాబాపై మరోసారి దయ చూపిన హర్యానా ప్రభుత్వం.. ఈసారి 30 రోజుల పెరోల్
గురువారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ ఆర్డినెన్స్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు పలువురు ప్రతిపక్ష నేతలను కూడా కలిశారు. కాంగ్రెస్‌తో సహా పలు విపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిస్తామని హామీ ఇచ్చాయి.