Supreme Court : మహిళ గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
శిశువులో ఎలాంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భం తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court Verdict
Supreme Court Sensational Verdict : మహిళ గర్భ విచ్ఛిత్తిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గర్భ విచ్ఛిత్తికి అవకాశమివ్వాలని ఓ వివాహిత అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. 26 వారాల గర్భాన్ని తొలగించేందుకు మహిళకు ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ఇద్దరు పిల్లల తల్లినని మూడవ శిశువుకు జన్మనివ్వలేనని, డిప్రెషన్ లో ఉన్నాను కాబట్టి గర్భాన్ని తొలగించేందుకు అవకాశమివ్వాలని ఓ మహిళ సుప్రీంకోర్టులో అభ్యర్థన పెట్టుకున్న విషయం తెలిసిందే.
శిశువులో ఎలాంటి సమస్య లేదని ఎయిమ్స్ వైద్యులు రిపోర్టు ఇచ్చారని, గర్భం తొలగించేందుకు అనుమతి ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గర్భానికి 26 వారాల 5 రోజులు నిండాయని, ఈ సమయంలో గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇవ్వడమంటే మెడికల్ టర్మినేషన్ యాక్టులోని 3,5 సెక్షన్లను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది.
ఆ చట్టం ప్రకారం తల్లికి ఎటువంటి ప్రమాదం లేదని, అది పిండానికి సంబంధించిన కేసు కాదని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుండె చప్పుడును ఆపలేమని సీజేఐ తెలిపారు.