CJI DY Chandrachud : నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్ ఫ్లాట్ ఫామ్ పరిధిలోకి సుప్రీంకోర్టు.. 80 వేల కేసులు పెండింగ్ : సీజేఐ చంద్రచూడ్
డేటా గ్రిడ్ మరింత పాదదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందన్నారు. ఇది చారిత్రకమైన దినం అని, ఈ విశిష్టమైన ఫ్లాట్ ఫామ్ ను ఎన్ఐసీ డెవలప్ మెంట్ చేసిందని పేర్కొన్నారు.

Supreme Court CJI DY Chandrachud
Supreme Court CJI DY Chandrachud : సుప్రీంకోర్టును నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్ ఫ్లాట్ ఫామ్ పరిధిలోకి తీసుకురానున్నట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. ఆ ప్రక్రియ త్వరగా పూర్తి కానున్నట్లు తెలిపారు. ఈ గ్రిడ్ ద్వారా పెండింగ్ లో ఉన్న కేసులను ట్రాకింగ్ చేయవచ్చని తెలిపారు. దీంతో డేటా గ్రిడ్ మరింత పాదదర్శకత, జవాబుదారీ తనాన్ని పెంచుతుందన్నారు. ఇది చారిత్రకమైన దినం అని, ఈ విశిష్టమైన ఫ్లాట్ ఫామ్ ను ఎన్ఐసీ డెవలప్ మెంట్ చేసిందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఇన్ హౌస్ టీమ్ కూడా ఆ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. బటన్ ను క్లిక్ చేస్తే రియల్ టైమ్ లోనే ఆ పెండింగ్ కేసులకు సంబంధించిన సమాచారం వస్తుందని అన్నారు. ఏ సంవత్సరంలో ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని కేసులు రిజస్టర్ అయ్యాయి, ఎన్ని కేసులు రిజిస్టర్ కాలేదన్న సమాచారం దాంట్లో ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం సుప్రీంకోర్టు వద్ద 80 వేల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు సీజేఐ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్ జేడీజీ పరిధిలో సుప్రీంకోర్టు లేదన్నారు. సుప్రీంకోర్టు వద్ద మరో 15 వేల కేసులు రిజిస్టర్ కావడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జులైలో సుమారు 5 వేల కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. త్రిసభ్య ధర్మాసనం ముందు సుమారు 583 కేసులు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
అయితే ఆ బెంచ్ లు త్వరగా కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. డేటా క్లీనింగ్ చేపట్టాల్సి ఉందని ఫిజికల్ రికార్డులకు డిజిటల్ డేటా మ్యాచ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టులు, జిల్లా కోర్టులు ఇప్పటికే డిజిటల్ ఫార్మాట్ లోకి వెళ్లినట్లు వెల్లడించారు.