బీజేపీ,కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్నిఏర్పాటు చేయలేరు: సురవరం

  • Published By: chvmurthy ,Published On : May 16, 2019 / 09:52 AM IST
బీజేపీ,కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్నిఏర్పాటు చేయలేరు: సురవరం

Updated On : May 16, 2019 / 9:52 AM IST

హైదరాబాద్: దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైనా బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంధ్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి  సురవరం సుధాకర రెడ్డి చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ …పశ్చిమ బెంగాల్ లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహం పగల గొట్టటం అంటే బెంగాల్ సంస్కృతిని అవమానించడమే అని అన్నారు.  బెంగాల్ ఘటనలు బీజీపీ, తృణమూల్ రెండూ బాధ్యత వహించాలని అన్నారు. 

పశ్ఛిమ బెంగాల్ లో ఒకరోజు ముందే ఎన్నికల ప్రఛార  నిలిపి వేయటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.  బీజేపీ ఎన్నికల ప్రచారం ముగిసిందని , మోడీ అమిత్ షాలపై చర్యతీసుకోలేని  ఎన్నికల సంఘం ఇలాంటి నిర్ణయం తీసుకుని విశ్వసనీయత కోల్పోయిందని ఆయన అన్నారు.  కేంద్రంలో  రాజ్యాంగ పరిరక్షణ కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడే ప్రభుత్వానికి మిగతా పార్టీలు  మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.