పాక్ జెట్ విమానాల కలకలం

పాక్‌లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్‌లో జెట్ విమానాలు కలకలం సృష్టించాయి. అవి చక్కర్లు కొట్టినట్టు కశ్మీరీ ప్రజలు చెబుతున్నారు.
ఎల్‌వోసీకి ఇరువైపులా ఇండియా, పాకిస్థాన్ జెట్ విమాన శబ్దాలు విన్నామని చెపుతున్నారు. పాక్ అర్ధరాత్రి సరిహద్దు వెంబడి కాల్పులకు తెగబడింది. జనావాసాలపై కాల్పులు జరిపింది. దీంతో పలుచోట్ల ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 5గురు భారత జవాన్లకు గాయాలయ్యాయి. దీంతో భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్‌కు చెందిన ఐదు పోస్టులను ధ్వంసం చేసింది.