లాక్ డౌన్ మహిమ : బీహార్ గ్రామస్థులకు ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 07:46 AM IST
లాక్ డౌన్ మహిమ : బీహార్ గ్రామస్థులకు ఎవరెస్ట్ శిఖరం కనిపిస్తోంది

Updated On : May 6, 2020 / 7:46 AM IST

కరోనా వైరస్ నేపథ్యంలో విధించడిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా మనుషుల పరిస్థితి ఎలా ఉన్నా ప్రకృతి మాత్రం పులకించి పోతోంది. లాక్ డౌన్ తో…దశ్దాలకాలంలో ఎన్నడూ చూడని కొత్త విషయాలను ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా సాధ్యం కాని క్లీన్ గంగా…లాక్ డౌన్ తో సాధ్యమైంది. మీరట్‌లోని గంగానదిలో డాల్ఫిన్స్‌ కూడా కనిపించాయి. చాలా ప్రదేశాల్లో పొల్యూషన్‌ బాగా తగ్గిపోయింది.

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో కూడా నీటి నాణ్యత మెరుగుపడింది. పొల్యూషన్ వల్ల దశాబ్దాల కాలంగా కనబడని వందల కిలోమీటర్ల దూరంలోని హిమాలయాలను కూడా పలు రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఇళ్లపైనుంచి సృష్టంగా చూడగల్గుతున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు బీహార్ లో కూడా  గాలి కాలుష్యం బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో అక్కడి ప్రజలకు ఇప్పుడు ఎవరెస్ట్ శిఖరం స్పష్టంగా కనిపిస్తోంది.

బీహార్‌ లోని సీతామర్హి జిల్లాలో సింగ్‌వాహిని అనే గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి ఎవరెస్ట్ శిఖరం 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలోనే ఉంటుంది. అంత దూరంలో ఉన్న ఎవరెస్ట్ తమ కంటికి కనిపిస్తుందని ఆ ఊరి ప్రజలు ఏనాడూ అనుకోలేదు.  అయితే ఇప్పుడు దశాబ్దాల తర్వాత పొల్యూషన్ లేకపోవడంతో సింగ్ వాహిని గ్రామస్థులు సృష్టంగా ఎవరెస్ట్ పర్వతాన్ని చూడగల్గుతున్నారు. ఎప్పుడైతే పొల్యూషన్ తగ్గిందో…గాలిని కలుషితం చేసే కార్బొన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి రకరకాల ప్రమాదకర వాయువులు గాల్లో తగ్గిపోయాయి. అందువల్ల ఎప్పుడో దశాబ్దాల కిందట… తమ తాత ముత్తాతలు చూసిన ఎవరెస్ట్ పర్వతాన్ని అక్కడి ప్రజలు ఇప్పుడు మళ్లీ చూస్తున్నారు.

అద్భుతమైన ఎవరెస్టును చూసి… ఫొటోలు తీసి… స్థానికులు ఎంతో ఆనందపడుతున్నారు. సింగ్‌వాహిని గ్రామానికి చెందిన రీతూ జైస్వాల్… తమ ఊరి నుంచి తీసిన ఎవరెస్ట్ పర్వతం ఫొటోని ట్విట్టర్‌లో షేర్ చేశారు. మంచు తెరలు, చెట్లతో అద్భుతమైన ఎవరెస్ట్ శిఖరం అందులో కనిపిస్తోంది. నా చిన్నప్పుడు ఎవరెస్ట్ కనిపించేదట. అది మా ఊరికి ఈశాన్య దిశలో ఉండేదట. ఇప్పుడు అదే దిశలో కనిపిస్తున్న ఎవరెస్టునే ఫొటో తీసాను అని రీతూ తెలిపారు. రీతూ తీసిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా,ఇటీవల మూడు దశాబ్దాలలో మొదటిసారిగా ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌‌ సిటీ వాసులకు 200 కిలో మీటర్ల ఏరియల్ డిస్టెన్స్(ఉపరితల దూరం)లో ఉన్న గంగోత్రి, బంద్రాపంచ్‌ పర్వాతాలు కన్పించిన విషయం తెలిసిందే .గత నెల ప్రారంభంలో, పంజాబ్ లోని జలంధర్ సిటీ ప్రజలు..దశాబ్దాల తర్వాత 160కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ లోని మంచుతో కప్పబడిన దౌలాదర్ హిమాలయ రేంజ్ ను  చూడగలిగిన విషయం తెలిసిందే. మరోవైపు బీహార్ లో ఇప్పటివరకు 536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 142మంది కోలుకోగా,4మరణాలు నమోదయ్యాయి.

Also Read | లాక్‌డౌన్ దెబ్బకు కుదేలైన రిటైల్‌.. రూ.5.5 లక్షల కోట్ల నష్టం