‘నేను డెలివరీ చేయను.. ఏం చేసుకుంటావో చేసుకో’ అని మహిళకు దురుసుగా సమాధానమిచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్

Swiggy: అంతేగాకుండా తన పిల్లలు ఎంతో ఆశతో వడాపావు తిందామని అనుకున్నారని, కానీ మ్యాగీతో..

‘నేను డెలివరీ చేయను.. ఏం చేసుకుంటావో చేసుకో’ అని మహిళకు దురుసుగా సమాధానమిచ్చిన స్విగ్గీ డెలివరీ బాయ్

నేహా అనే ఓ మహిళ ఆఫీసుకి వెళ్లింది. ఇంట్లో ఉన్న తన పిల్లలకోసం Swiggyలో వడాపావ్, రోల్ ఆర్డర్ చేసింది. సంబంధిత రెస్టారెంట్ నుంచి ఆర్డర్ తీసుకున్న డెలివరీ బాయ్ ఆ ఫుడ్ ని ఎంతసేపటికీ డెలివరీ చేయలేదు. విసిగిపోయిన ఆ మహిళ డెలివరీ బాయ్‌కి కాల్ చేసింది. దీంతో అతడు.. ‘నేను డెలివరీ చేయను.. నాకు టైం లేదు.. నువ్వు ఏమీ చేసుకుంటావో చేసుకో’ అని దురుసుగా సమాధానం ఇచ్చాడు.

దీంతో వెంటనే ఆ మహిళ ట్విట్టర్‌లో swiggy కస్టమర్ కేర్ కి టాగ్ చేస్తూ ఓ పోస్ట్ చేసింది. తన ఆర్డర్ కు సంబంధించిన బిల్లుని కూడా అటాచ్ చేసింది. ఫోన్ కాల్ లో డెలివరీ బాయ్‌తో జరిగిన సంబాషణ గురించి ట్వీట్లో వివరాలు తెలిపింది.

అంతేగాకుండా తన పిల్లలు ఎంతో ఆశతో వడాపావు తిందామని అనుకున్నారని, కానీ మ్యాగీతో సరిపెట్టుకున్నారని ఎంతో ఆవేదన చెందింది. ఆమె చేసిన ట్వీట్ కి swiggy రెస్పాండ్ అవ్వడమే కాకుండా రిఫండ్ కూడా చేసింది. ఆ మహిళ ఫుడ్ ఆర్డర్ చేస్తే ఆమెకు ఎదురైన అనుభవం మరెవరికీ ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.

 

Sourav Ganguly : తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న గంగూలీ.. ఆ స‌మాచారం ఎక్క‌డ లీక్ అవుతుందోన‌ని!