Hizab Row: వ్యవస్థ షరియత్ ప్రకారం కాదు.. రాజ్యాంగం ప్రకారమే నడిచేది- యోగి ఆదిత్యనాథ్
యూపీ సీఎం యోగి 'దేశం మీద సంస్థల మీద వ్యక్తిగత మత సిద్ధాంతాలను రుద్దకూడదు. ఉత్తరప్రదేశ్ లోని ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని నేను అడగాలా.. డ్రెస్ కోడ్ స్కూల్స్ లో తప్పకుండా...

Up Cm Yogi Adityanath
Hizab Row: కర్ణాటక హిజాబ్ వివాదంపై యోగి ఆదిత్యనాత్ స్పందించారు. దేశం షరియత్ చట్ట ప్రకారం నడవదని రాజ్యాంగం అనుసరించే వ్యవస్థ ఉంటుందని అన్నారు. ఏఐఎమ్ఐఎమ్ చీఫ్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు ప్రధాని అవుతార’ని అన్నారు. ఈ అంశంపై మాట్లాడిన యోగి ఆదిత్యనాథ్..
‘ప్రధాని మోదీ ట్రిపుల్ తలాఖ్ నియమాన్ని తుడిచిపెట్టేసి ముస్లిం కూతుళ్లకు స్వేచ్ఛ కల్పించారు. అలా వారికి హక్కులను, గౌరవాన్ని ఇవ్వగలిగారు. కూతుళ్లను కాపాడుకోవడానికి వ్యవస్థను రాజ్యాంగం ప్రకారమే నడిపిస్తాం. ఏ షరియత్ చట్టానికి అనుగుణంగానో కాదు’ అని ఆదిత్యనాథ్ అన్నారు.
ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇతెహదుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్, లోక్‌సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. హిజాబ్ ధరించే మహిళే ఏదో ఒక రోజు ప్రధాని అవుతుందని అన్నారు. ‘ఆ రోజు నేను బతికి ఉండకపోవచ్చు. కానీ, గుర్తు పెట్టుకోండి. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతుంది’ అని అన్నారు.
Read Also: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ రూ.లక్షల కోట్ల సంపద ఆవిరి
కామెంట్ పై రెస్పాండ్ అయిన యూపీ సీఎం యోగి ‘దేశం మీద సంస్థల మీద వ్యక్తిగత మత సిద్ధాంతాలను రుద్దకూడదు. ఉత్తరప్రదేశ్ లోని ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని నేను అడగాలా.. డ్రెస్ కోడ్ స్కూల్స్ లో తప్పకుండా అమలుచేయాలి. దేశం రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తేనే మహిళలకు గౌరవం, సెక్యూరిటీ, స్వాతంత్ర్యం దక్కుతాయి’ అని వివరించారు.
హిజాబ్ అంశం మీద కర్ణాటక హైకోర్టు ఫిబ్రవరి 14 సోమవారం (ఇవాళ) మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు విచారణ జరపనుంది. దీనిపై వాదనలు వినడానికి సుప్రీం కోర్టు ఇప్పటికే తిరస్కరణను తెలియజేసింది. ముందు హైకోర్టు విచారణను వినాల్సిందేనని సూచించింది.