దక్షిణ కొరియా బాటలోనే టెస్టింగ్…5లక్షల యాంటీబాడీ కిట్స్ కోరిన ICMR

కరోనా వైరస్(COVID-19)టెస్టింగ్ ను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా…వైరస్ నిర్ధారణ కోసం 5 లక్షల యాంటీబాడీ కిట్లను సరఫరా చేయాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మ్యానుఫ్యాక్చరర్స్(తయారీదారులు)ను ఆహ్వానించింది. అయితే దక్షిణ కొరియాలో చేసిన విధంగా సెరొలాజికల్ టెస్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్ గా పనిచేస్తుందని కొందరు ప్రభుత్వ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనాను కట్టడి చేయడంలో దక్షిణ కొరియా కొంతమేర విజయం సాధించింది.
నిమ్హాన్స్(NIMHANS)డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోవైరాలజీ హెడ్ అండ్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రవి మాట్లాడుతూ…కేవలం ఒకే రోగి కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా…దేశంలో పెద్ద సంఖ్యలో అనుమానిత రోగులు నిర్బంధించబడిన విషయం పరిగణనలోకి తీసుకుంటే, COVID-19కు యాంటీబాడీ టెస్ట్ “స్క్రీనింగ్ పరీక్ష” గా పనిచేస్తుంది. ఇది కొన్ని గంటల్లో శీఘ్ర ఫలితాలను ఇస్తుందని ఆయన తెలిపారు. భారత్ లో జరిగిన సాంప్రదాయ RT-PCR టెస్ట్(రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) వైరస్ జెనటిక్ మెటీరియల్ RNA ను గుర్తించింది. వైరస్ కు శరీర స్పందన ఏవిధంగా ఉందనేది యాంటీబాడీ టెస్ట్ గుర్తిస్తుంది. ముందుది డెర్టక్ట్ ఎవిడెన్స్(ప్రత్యక్ష ఆధారం) మరియు తర్వాతది ఇన్ డైరక్ట్ ఎవిడెన్స్(పరోక్ష ఆధారం). పెద్ద సంఖ్యలో ప్రజలు క్వారంటైన్ అయిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ RNA టెస్ట్ సాధ్యపడదు కనుక యాంటీబాడీ టెస్ట్ ను స్క్రీనింగ్ టెస్ట్ గా ఉపయోగించుకోవచ్చు.
PCR కిట్స్ కొరతతో,టెస్ట్ చాలా సంక్లిష్ఠంగా,ఖరీదైనదిగా,సమయం ఎక్కువ తీసుకుంటూ ఉంది. దక్షిణ కొరియా ఏం చేసిందంటే ట్రావెల్ హిస్టరీ(ఎక్కడెక్కడ ప్రయాణించారు) ఉన్నోళ్లకు,కాంటాక్ట్ లకు స్క్రీనింగ్ చేయడం ప్రారంభించారు. యాంటీ బాడీ కిట్ ఉపయోగించి సెరొలాజికల్ టెస్ట్ నిర్వహించారు. ఓ వ్యక్తికి వైరస్ సోకిందా అనేది యాంటిబాడీ ఓ ఇండికేషన్(సూచన)ఇస్తుంది. ఒకవేళ ఈ టెస్ట్ లో పాజిటివ్ కనుక వస్తే బ్లడ్ శాంపిల్స్ సేకరించి PCR కిట్ ఉపయోగించి RNA టెస్ట్ చేయవచ్చని, టూ-స్టేజ్ ప్రాసెస్ ఉంటుందని డాక్టర్ రవి తెలిపారు. అడ్వాంటేజ్(ప్రయోజనం)ఏమిటంటే యాంటీబాడీ టెస్ట్ చాలా సులభం. కేవలం ఒక డ్రాప్ బ్లడ్(రక్తం) సరిపోతుంది మరియు కేవలం 2గంటల్లోనే ఫలితాలు వస్తాయి. కొన్ని కిట్లకు మొత్తం బ్లడ్ కావాల్సివస్తుందని,మరికొన్ని కిట్ లకు అయితే రక్తం.. అపకేంద్రీకృతమై ఉండాల్సి ఉంటుంది. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే…ఒక వ్యక్తికి ఖచ్చితంగా కరోనా సోకింది అని చెప్పగలిగే టెస్ట్ కాదిది. ఇది కేవలం స్క్రీనింగ్ మాత్రమే అని డాక్టర్ రవి తెలిపారు.
5 లక్షల యాంటీబాడీ కిట్ ల “తాత్కాలిక అవసరం” కోసం కొటేషన్లు సమర్పించడానికి సరఫరాదారులను ఆహ్వానిస్తూ, దేశంలోని ఆరు ప్రదేశాలకు(దిబ్రుఘర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, భోపాల్ ఢిల్లీ) సరఫరా “భరోసా” ఇవ్వాలని ICMR తెలిపింది. ప్రస్తుతం భారత్..కేవలం RT-PCR టెస్ట్ మాత్రమే చేస్తుంది. ఒక ప్రైవేట్ లేబొరేటరీలో ఒక RT-PCR టెస్ట్ కోసం ప్రభుత్వం రూ .4,500 ధరను నిర్ణయించింది. 7 లక్షల RNA ఎక్స్ ట్రాక్షన్ కిట్స్ సేకరణకై కూడా ICMR కొటేషన్ దాఖలు చేయాలని సప్లయర్స్(సరఫరాదారులు)ను కోరింది. సెరోలాజికల్ టెస్ట్…తక్కువ సమయంలో అనుమానాస్పద రోగులను పరీక్షించడంలో మాత్రమే సహాయపడుతుందని డాక్టర్ రవి గుర్తు చేశారు, కాని సామూహిక టెస్ట్ కోసం ఇది ఒక టూల్ గా ఉండే లక్ష్యంగా లేదు. గుర్తుపెట్టుకోవాల్సిందేంటటే, కరోనా వైరస్ సోకిన రోగులతో పరిచయం ఉన్న వ్యక్తులను స్క్రీన్ చేయడానికి ఇది ఒక పరీక్ష అంతే. ఉదాహరణకు,X అనే వ్యక్తికి కరోనా సోకి ఉంటే, కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా, 1,000 మంది X తో పరిచయం కలిగి ఉన్నారని తెలుస్తుంది, ఆ 1000 మంది వ్యక్తులు, 4-5 రోజుల తరువాత, స్క్రీనింగ్ కోసం యాంటీబాడీ పరీక్ష చేయించుకోవచ్చు. ఏదేమైనా, ఈ 1,000 మంది వ్యక్తులు ఇంకా 14 రోజులు క్వారంటైన్ కు వెళ్లవలసి ఉంటుందని డాక్టర్ రవి చెప్పాడు.
యాంటీబాడీలో పాజిటివ్ టెస్ట్…. మీరు వైరస్ కు గురయ్యారని మీకు తెలియజేస్తుంది,అదే నెగిటివ్ టెస్ట్.. COVID-19 ఇన్ఫెక్షన్ ను తోసిపుచ్చదు. అటువంటి పరీక్ష యొక్క విశ్వసనీయత, సాధారణంగా, వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించిన ఏడు రోజుల తరువాత. ప్రాబబులిటీ(జాడ)ఏమిటో, ఏ సమయంలో అది ఖచ్చితమైనది అనేది కిట్ స్పష్టంగా చెబుతుందని డాక్టర్ రవి చెప్పారు.