పెట్రేగుతున్న విద్వేషం: తమిళనాడులో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

  • Published By: madhu ,Published On : August 26, 2019 / 07:16 AM IST
పెట్రేగుతున్న విద్వేషం: తమిళనాడులో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం

Updated On : May 28, 2020 / 3:43 PM IST

తమిళనాడు రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓ వర్గానికి చెందిన కొంతమంది అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ మరో వర్గం ఆందోళన చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఘర్షణల్లో 10 మందికి గాయాలైనట్లు సమాచారం. భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని సద్దుమణించేందుకు ప్రయత్నిస్తున్నారు. 

వేదారణ్యం పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఉంది. కొంతమంది యువకులు అక్కడకు చేరుకుని రాళ్లు..కర్రలతో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన 2019, ఆగస్టు 25వ తేదీ ఆదివారం చోటు చేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కొన్ని వాహనాలకు నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించిన పోలీసులపై రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. సాయుధ బలగాలను ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. పార్టీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
Read More : చిద్దూకి సుప్రీం షాక్… బెయిల్ పిటిషన్ తిరస్కరణ
తమిళనాడులో విగ్రహాల ధ్వంసం కొత్తేమీ కాదు. గతంలో కూడా చెన్నైలోని పలు చోట్ల అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేయడమో..అవమానించడమో చేశారు. దీనిపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కావాలనే విగ్రహాల ధ్వంసానికి పూనుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. వెంటనే దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. 
Nagapattinam: Statue of Dr. BR Ambedkar vandalised by a person amid clashes between two groups in Vedaranyam yesterday. #TamilNadu pic.twitter.com/cMSDpxjrBa