నమో నమః :ప్రధాని మోడీకి గుడి కట్టిన రైతన్న

ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రోజు పూజలు చేసేంత. మోడీకి పూజలు చేయండే పచ్చి మంచినీళ్లు కూడా శంకర్ తాగడు. ప్రతీ రోజు మోడీ విగ్రహానికి…దీపం వెలిగిస్తాడు. పూజలు చేసి హారతి కూడా ఇస్తాడు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోడీ కిసాన్ సమ్మాన్ నిధి వంటి సంక్షేమ పథకాలు తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని..రైతులను ఆదుకునే పాలకులు దేవుళ్లతో సమానమని..అందుకే తాను మోడీకి గుడి కట్టానని తెలిపాడు. శంకర్ కట్టిన మోడీ గుడి ఎత్తు 8×8 అడుగుల ఎత్తు ఉంది. గుడి నిర్మాణానికి రూ.1.2 లక్షలు ఖర్చయిందని శంకర్ చెప్పాడు.
శంకర్ కట్టిన గుడి ప్రధాని మోడీ విగ్రహంతోపాటు జాతిపిత మహాత్మాగాంధీ, కాంగ్రెస్ నేత కే కామరాజ్, ఏఐఏడీఎంకే అధినేతలు ఎంజీ రామచంద్రన్, జే జయలలిత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, తమిళనాడు సీఎం కే పళనిస్వామి ఫొటోలను కూడా గుడిలో పెట్టాడు.
ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడులోని ఓ రైతు గుడి కట్టాడు. తిరుచిరాపల్లిలోని ఎరాకుడి గ్రామంలో పీ శంకర్ (50) అనే రైతుకు ప్రధాని మోడీఅంటే ప్రాణం. ఆయన్ని దేవుడిగా భావిస్తాడు.ఎంతగానో ఆరాధిస్తాడు. మోడీపై శంకర్ కు ఉన్న భక్తి ఎంత అంటే గుడి కట్టి ప్రతీ రోజు పూజలు చేసేంత. మోడీకి పూజలు చేయండే పచ్చి మంచినీళ్లు కూడా శంకర్ తాగడు. ప్రతీ రోజు మోడీ విగ్రహానికి పూజలు చేసి హారతి కూడా ఇస్తాడు.