పట్టాలపై కూర్చుని మందు కొడుతున్నవిద్యార్థులు: మీదనుంచి దూసుకెళ్లిన ట్రైన్

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 07:37 AM IST
పట్టాలపై కూర్చుని మందు కొడుతున్నవిద్యార్థులు: మీదనుంచి దూసుకెళ్లిన ట్రైన్

Updated On : November 14, 2019 / 7:37 AM IST

ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు రైలు పట్టాలపై కూర్చొని మద్యం తాగుతున్నారు. అలా మద్యం తాగుతున్న ఆ నలుగురు విద్యార్థలుపై నుంచి రైలు దూసుకుపోయింది. దీంతో ఆ నలుగురు  అక్కడికక్కడే చనిపోయారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో బైటపడ్డాడు. ఇది సినిమా కాదు నిజంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు నగరంలో బుధవారం (నవంబర్ 13) రాత్రి చోటుచేసుకుంది. 

కోయంబత్తూర్ లోని ఓ  ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకుంటున్న విద్యార్థులు డి. సిద్ధిఖ్ రాజా (22), రాజశేఖర్ (20), గౌతం (23), కురుస్వామి(24)లు మద్యం తాగాలనుకున్నారు. ఏదో రూమ్ లోనే లేదా బార్ లోనో కాదు లూరులోని రౌతర్ పాలం రైల్ ఓవర్‌బ్రిడ్జి సమీపంలోని రైలు పట్టాల వద్ద కూర్చొని మద్యం తాగుతున్నారు. ఇంతలో  చెన్నై-అల్లప్పుంజా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ వీరిపై నుంచి దూసుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. విఘ్నేష్ అనే మరో విద్యార్థి తీవ్రం గాయాలతో బతికి బైటపడ్డాడు. 
దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న  విఘ్నేష్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స నందిస్తున్నారు. రైలు కిందపడి మరణించిన నలుగురు విద్యార్థుల మృతదేహాలను కోయంబత్తూర్ ప్రభుత్వ వైద్యకళాశాలకు తరలించారు.విద్యార్థులు రైల్వే ట్రాక్‌పై కూర్చొని మద్యం తాగుతుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.  సంఘటన స్థలంలో రైల్వేట్రాక్ వద్ద మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ కప్ లు పోలీసులకు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
మృతి చెందిన విద్యార్థులు కొడైకెనాల్, తేని, విరుతునగర్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. గౌతమ్, కురుప్పస్వామిలు కాలేజ్ 2018 ఫైనల్ ఇయర్ చెందినవారనీ..ఓ ఓగ్జామ్ రాయటానికి వచ్చారనీ తెలిపారు. రాజశేఖర్ థర్ట్ ఇయర్ చదువుతుండగా..మరో ఇద్దరు ఫైనల్ ఇయర్ విద్యార్తులని .. గాయపడిన విఘ్నేష్ ఇంజనీరింగ్ ఫైనలియర్ స్టూడెంట్ అని..గుర్తించారు. 

చదువుకునే వయస్సులో యువత మద్యానికి అలవాటుపడుతున్నారు. విచక్షణ మరచి ప్రవర్తిస్తున్నారు కొంతమంది విద్యార్థులు. ఎన్నో ఆశలతోను..పిల్లల భవిష్యత్తు కోసం లక్షలు ఖర్చుపెట్టి తల్లిదండ్రులు చదివిస్తుంటే..కొంతమంది మాత్రం మత్తు పదార్ధాలకు ..మద్యాలకు అలవాటు పడుతున్నారు. క్రమేపీ వాటికి బానిసలుగా మారుతున్నారు. దీంతో వారిపై ఆశలు పెట్టుకున్నా కన్నవారి కలలు కల్లలు అవుతుంటే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.