Palaniswami: గవర్నర్ వద్దకు పళనిస్వామి..! భేటీపై ఉత్కంఠ.. క్షణక్షణం మారుతున్న తమిళ రాజకీయాలు..
మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదన్నారు. 118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేశారు.
Palaniswami: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణానికి మారిపోతున్నాయి. ఏఐఏడీఎంకే నేత పళనిస్వామి గవర్నర్ ను కలవబోతున్నారు. పళనిస్వామి గవర్నర్ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు గవర్నర్ ను కలిశారు టీవీకే విజయ్. సంపూర్ణ మెజారిటీ ఉంటేనే ప్రభుత్వ ఏర్పాటునకు ఆహ్వానిస్తామని గవర్నర్ తేల్చి చెప్పారు. మెజారిటీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు కుదరదన్నారు. 118 మంది సభ్యుల వివరాలు ఇవ్వాల్సిందేనని గవర్నర్ స్పష్టం చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల క్యాంప్ రహస్య ప్రదేశంలో కొనసాగుతోంది.
పళనిస్వామి గవర్నర్ అపాయింట్ మెంట్ ఎందుకు తీసుకున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి అన్నాడీఎంకేలో కేవలం 47 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మొత్తం 3 కూటముల్లో చూస్తే వాళ్లు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు అన్నాడీఎంకే నేత పళనిస్వామి గవర్నర్ ను ఎందుకు కలుస్తున్నారు? అనేది ఉత్కంఠగా మారింది. తాజా రాజకీయ సంక్షోభంపై ఆయన గవర్నర్ తో మాట్లాడి తాజా రాజకీయ అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్ ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి కోరారు. కానీ, రెండుసార్లు కూడా విజయ్ విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. ఈ క్రమంలో మరో ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉందా అనే అంశంపై గవర్నర్ తో డిస్కస్ చేసేందుకే పళనిస్వామి నేరుగా గవర్నర్ ను కలవబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయం అంటే కూటములు జతకడితే వాటికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఏదైనా ఉంటుందా అన్న అంశంపై గవర్నర్ ను కలిసి రాజ్యాంగబద్దమైన సలహా కూడా పొందే ప్రయత్నాల్లో పళనిస్వామి ఉన్నట్లు సమాచారం.
