Tamil Nadu : బైక్ నెంబ‌ర్ ప్లేట్‌పై ‘ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని’ అని రాయించుకుని దర్జాగా తిరిగేస్తున్నా..ఎంత బలుపు?!

బైక్ నెంబ‌ర్ ప్లేట్‌పై ‘ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని’ అని రాయించుకుని దర్జాగా తిరిగేస్తున్నాడు ఓ యువకుడు..

Tamil Nadu : బైక్ నెంబ‌ర్ ప్లేట్‌పై ‘ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని’ అని రాయించుకుని దర్జాగా తిరిగేస్తున్నా..ఎంత బలుపు?!

Tamil Nadu Man Under Fire For 'grandson Of Mla' Written On Bike Number Plate

Updated On : March 17, 2022 / 5:32 PM IST

Tamil Nadu Man : రాంగ్ రూట్ లో వచ్చినా..హెల్మెట్ పెట్టుకోకపోయినా..కారు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసినా..ట్రాఫిక్ పోలీసులు ఆపి ప్రశ్నిస్తే..‘నేను ఎవరో తెలుసా? ఎమ్మెల్యే కొడుకుని…లేదా మనుమడిని..లేదా మంత్రి కొడుకుని’అని తలబిరుసుగా సమాధానం చెప్పేవారిని చూసి ఉంటాం. లేదా విని ఉంటాం. కానీ ఓ యువకుడు మాత్రం అంతకు మించే ఉన్నాడు. ఏకంగా బైక్ నంబర్ ప్లేట్ మీద ‘నేను ఎమ్మెల్యే మనుమడిని’అని రాయించుకుని దర్జాగా తిరిగేస్తున్నాడు..!!.త‌మిళ‌నాడు క‌న్యాకుమారి జిల్లాలోని నాగ‌ర్‌కోయిల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మ‌న‌వ‌డిని.. అని చెప్పుకుంటూ (రాయించుకుని) ఓ యువ‌కుడు త‌న బైక్ నెంబ‌ర్ ప్లేట్‌పై ఏకంగా నేను నాగ‌ర్‌కోయిల్ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ మ‌న‌వ‌డిని అని రాయించుకున్నాడు. దర్జాగా రోడ్లపై తిరిగేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆ బైక్ నెంబ‌ర్ ప్లేట్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Also read : Tamil Nadu: ప్రజలకు ఉచితంగా ఆరోగ్య, వైద్య సేవలు..‘రైట్ టు హెల్త్’ బిల్ కోసం సీఎం యత్నాలు

‘ఎంత బలుపు ఏంటా తల బిరుసు’..ఎంత ఎమ్మెల్యే మనుమడు అయితే అలా బైక్ నేమ్ ప్లేట్ మీద రాయించుకుంటాడా? అని అనుకుంటున్నారు కదూ..కానీ ఇక్కడ మరో ట్విస్టు ఉంది. సదరు యువ‌కుడు బైక్ మీద రాయించుకున్నట్లుగా అతను ఏ ఎమ్మెల్యే మనుమడు కాదు. అసలు నాగ‌ర్ కోయిల్ ఎమ్మెల్యే 73 ఏళ్ల ఎంఆర్ గాంధీకి అస‌లు పెళ్లే కాలేదు. పెళ్లి కాకుండా మ‌న‌వ‌డు ఎలా వ‌చ్చాడంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు సెటైర్లు వేస్తున్నారు.పైగా సదరు యువకుడు కూడా అచ్చంగా ఎమ్మెల్యే మనుమడులాగా మాంచి రిచ్ గా జబర్ధస్త్ గా ఉన్నాడు.

కాగా..2021 లో జ‌రిగిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో బీజేపీ.. ఏఐఏడీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. అయిన‌ప్ప‌టికీ బీజేపీ కేవ‌లం 4 సీట్లు మాత్ర‌మే గెలుచుకుంది. దాంట్లో అందులో నాగ‌ర్ కోయిల్ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. 1980 వ సంవ‌త్స‌రం నుంచి ఎంఆర్ గాంధీ.. నాగ‌ర్ కోయిర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వ‌స్తున్నాడు.నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనే ఎమ్మెల్యేగా గెలిచారు. చాలా సింపుల్ గా ఉంటారు. కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అసెంబ్లీకి వెళతారు గాంధీ.

Also read : Airport Baggage: ఐపీఎస్ అధికారి బ్యాగులో అవి చూసి అవాక్కైనా ఎయిర్ పోర్ట్ సిబ్బంది

గాంధీకి పెళ్లి కాలేదు. త‌న కారు డ్రైవ‌ర్ క‌న్న‌న్‌నే త‌న సొంత మ‌నిషిలా చూసుకుంటాడు గాంధీ. ఆ క‌న్న‌న్ కొడుకే బైక్ మీద దర్జాగా తిరిగేస్తున్న సదరు యువ‌కుడు అమ్రిష్. క‌న్న‌న్‌ను గాంధీ కొడుకులా చూసుకుంటాడు కాబ‌ట్టి.. గాంధీని త‌ను తాత‌లా భావించి.. తాను ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని అంటూ ఆ యువ‌కుడు చ‌లామ‌ణి అయిపోతున్నట్లుగా కనిపిస్తోంది.నిజానికి గాంధీ చాలా నిరాడంబ‌రంగా ఉండే వ్య‌క్తి. అసెంబ్లీకి కూడా చాలా సాధార‌ణంగా వెళ్తారు. ఆయ‌న ఇటువంటివి అస్స‌లు ప్రోత్సహించే వ్యక్తికాదు. కానీ సదరు యువకుడు చేసిన పనికి పాపం పేరుకు తగినట్లుగా నిరాడంబరంగా ఉండే గాంధీ పేరును బద్నామ్ చేస్తున్నాడీ దూకుడు మీదున్న యువకుడు.