Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చేసిందట..

దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు.

Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్…! సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చేసిందట..

Updated On : February 12, 2025 / 5:42 PM IST

Kamal Haasan : తమిళ సూపర్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ను రాజ్యసభకు నామినేట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి డీఎంకే పార్టీ కమల్ ను పెద్దల సభకు నామినేట్ చేస్తుందని సమాచారం. జూలైలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ప్రచారం తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు. తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ ఇంటికి వెళ్లారు. కమల్ ను కలిశారు. ఆయనతో మాట్లాడారు. మీకు రాజ్యసభ సీటు కన్ ఫర్మ్ చేసినట్లు చెప్పారట.

Also Read : ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు.. ఇలా అయితే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు!

కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయం పార్టీ గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. పొత్తులో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2025 ఏడాదికి ఒక రాజ్యసభ సీటు ఇస్తామని అప్పట్లో వాగ్దానం ఇచ్చారట. ఈ డీల్ లో భాగంగా, లోక్ సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినందుకు, మిత్ర ధర్మం పాటిస్తూ.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారట.

కాగా, దేశం కోసమే తమ పార్టీ కూటమికి మద్దతు ప్రకటించిందని, తాను ఏ పోస్టు ఆశించలేదని అప్పట్లో కమల్ హాసన్ చెప్పారు. జూన్ లో 6 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రామిస్ ను కమల్ హాసన్ కు చేరవేశారు మంత్రి శేఖర్ బాబు. మిమ్మల్ని పెద్దల సభకు పంపిస్తామని కమల్ హాసన్ తో ఆయన చెప్పినట్లు సమాచారం.


డీఎంకేతో ఒప్పందం మేరకు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై కోయంబత్తూరు నుంచి పోటీ చేయాలని కమల్ అనుకున్నారు. అయితే, డీఎంకే నుంచి వచ్చిన విజ్ఞప్తితో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. అదే సమయంలో రాజ్యసభ సీటు ఇస్తామని కమల్ కు డీఎంకే నుంచి ఆఫర్ వచ్చింది. అది కూడా ఆ రాజ్యసభ సీటు కమల్ కు మాత్రమే ఇస్తామని చెప్పిందట.

Also Read : భార్యకు ఇష్టం లేకున్నా భర్త అసహజ శృంగారం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు..!

మక్కల్ నీది మయం పార్టీ పోటీ చేసిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమికి మద్దతు ఇచ్చింది. కూటమి అభ్యర్థుల విజయానికి కమల్ కృషి చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానాల్లో ఒక స్థానం నుంచి కమల్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ సమయంలో లోక్ సభకు వెళ్లేందుకు కమల్ సిద్ధంగా లేరు.