అస్సాం మాజీ సీఎం పరిస్థితి విషమం

అస్సాం మాజీ సీఎం పరిస్థితి విషమం

Updated On : November 23, 2020 / 5:15 PM IST

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గోగొయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని డాక్టర్లు అంటున్నారు. సోమవారం ఉదయానికి అతని ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొవిడ్ సమస్య నుంచి బయటపడిన ఆయన గౌహతి మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.

9మంది డాక్టర్ల పర్యవేక్షణలో గోగొయ్‌ను మానిటర్ చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్ అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని గౌహతికి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారట. హెల్త్ సరిపడటానికి అవసరమైన చికిత్సను తప్పక అందించాలని సీఎం నుంచి మెడికల్ టీంకు ఆదేశాలు అందాయి.



‘ప్రస్తుతం గోగోయ్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. మా బెస్ట్ చేయడానికి మేం ప్రయత్నిస్తున్నాం’ అని జీఎంసీహెచ్ సూపరిండెంట్ అభిజిత్ శర్మ అభిజిత్ శర్మ మీడియాతో అన్నారు. హెల్త్ మినిష్టర్ హిమంత బిశ్వ శర్మ.. మాజీ సీఎం హెల్త్ కండీషన్ క్రిటికల్ గా ఉందని స్పష్టం చేశారు. డాక్టర్లు బెటర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ప్రజల ప్రార్థనలు, దేవుడి దీవెనలు అతణ్ని ఆరోగ్య పరిస్థితిని మెరుగుచేయాలి’ అని అన్నారు.

మెదడు నుంచి అందుకునే సిగ్నల్స్ కు అవయవాలు రెస్పాండ్ అవడం లేదు. పేస్ మేకర్ సహాయంతో గుండె కొట్టుకుంటుండగా, కళ్ల కదలికలు గమనించగల్గుతున్నాం. మిగిలిన ఫంక్షన్లు పనిచేయడం లేదు. ఆదివారం డయాలసిస్ చేయించుకున్న గోగొయ్ మరోసారి చేయించుకునేంత సమర్థతతో లేరు.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డాక్టర్ల టీం ఆయన్ను గమనిస్తూనే ఉంది. అవయవాలు ఫెయిల్ కావడంతో వెంటిలేషన్ తో ట్రీట్ చేస్తున్నారు. 84ఏళ్ల గోగొయ్‌ను నవంబర్ 2వ తేదీ నుంచి గోగొయ్ కు ట్రీట్‌మెంట్ అందిస్తూనే ఉన్నారు. కొద్ది నెలలుగా పలుమార్లు హాస్పిటల్ లో అడ్మిట్ అయి డిశ్చార్జ్ అవుతూనే ఉన్నారు.