Threat Call : బెంగళూరు టీసీఎస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు

ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Threat Call : బెంగళూరు టీసీఎస్ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు

Bengaluru TCS office threat

TCS office Receives Threat Call : కర్ణాటక రాజధాని బెంగళూరులోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కార్యాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. మాజీ ఉద్యోగి టీసీఎస్ కార్యాలయానికి బెదిరింపు కాల్ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం (నవంబర్ 14,2023) బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టీసీఎస్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే కంపెనీపై ఆగ్రహంతో ఓ మాజీ ఉద్యోగి ఈ కాల్ చేసినట్లు తేలింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన విచారిస్తున్నారు.

ఉద్యోగి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కంపెనీ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులు పనిలో ఉండగా కార్యాలయం క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే వారందరినీ క్యాంపస్ ప్రాంగణం నుంచి బయటకు పంపించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పరప్పన అగ్రహార పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Akasa Air Flight : అకాస ఎయిర్ ముంబై-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు

పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్యాంపస్‌లో పేలుడు పదార్థాల కోసం వెతికారు. కానీ, క్యాంపస్ లోపల బాంబు, పేలుడు పదార్థాలకు సంబంధించినవి ఏమీ కనిపించలేదు. దీంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.ఫేక్ బాంబు కాల్ గా నిర్ధారించారు. కంపెనీ మాజీ ఉద్యోగి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మాజీ ఉద్యోగి వివరాలపై పోలీసులు ఆరా తీశారు.

కర్ణాటకలోని హుబ్లీ జిల్లాకు చెందిన మహిళ కంపెనీపై కోపంతో ఫోన్ చేసినట్లు గుర్తించారు. అంతకుముందు, మే నెలలో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని టీసీఎస్ కార్యాలయం క్యాంపస్‌కు కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చింది. డయల్ 100కి కాల్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు వెంటనే యాజమాన్యాన్ని అప్రమత్తం చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ చేసిన వ్యక్తి గతంలో అదే కార్యాలయంలో పనిచేసిన మాజీ భద్రతా సిబ్బందిగా గుర్తించారు.