Akasa Air Flight : అకాస ఎయిర్ ముంబై-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు

అకాస ఎయిర్ ముంబయి-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి వరణాసి వెళుతున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానానికి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వరణాసి విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది...

Akasa Air Flight : అకాస ఎయిర్ ముంబై-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు

Akasa Air Flight

Updated On : September 30, 2023 / 9:50 AM IST

Akasa Air Flight : అకాస ఎయిర్ ముంబయి-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ముంబయి నుంచి వరణాసి వెళుతున్న ఆకాశ ఎయిర్‌లైన్స్ విమానానికి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో వరణాసి విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బాంబు బెదిరింపు గురించి విమానం కెప్టెన్‌కు సమాచారం అందించింది. (Akasa Air Mumbai-Varanasi Flight Receives Bomb Threat) దీని తర్వాత అత్యవసర విధానాలను అనుసరించి విమానాన్ని వరణాసిలో ల్యాండ్ చేశారు.

Pakistani politicians : లైవ్ టీవీ షోలో పాక్ రాజకీయ నేతల ముష్టి యుద్ధం

విమానం ప్రత్యేక రన్‌వేపై ల్యాండ్ చేసిన తర్వాత విమాన ప్రయాణికులను వెంటనే దించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది గంటపాటు విమానంలో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో బాంబు ఏమీ దొరకలేదు. బాంబు సమాచారం అందగానే ఎయిర్‌పోర్టు అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని తనిఖీలు చేయగా అంతా మామూలుగానే ఉన్నట్లు తేలిందని వరణాసి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా చెప్పారు.

Zimbabwe : జింబాబ్వేలో కూలిన గని…ఆరుగురి మృతి

ఈ విమానం వారణాసికి మాత్రమే వస్తోండటంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక రన్‌వేపై ల్యాండ్ చేయించామని గుప్తా పేర్కొన్నారు. విమానంలో బాంబు లేకపోవడంతో విమానాశ్రయ అధికారులు, ఆకాస ఎయిర్ లైన్స్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.